విశాఖ

హెల్త్ అసిస్టెంట్ల నిరసన ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, డిసెంబర్ 9: తమ సమస్యను పరిష్కరించాలని గత ఐదు రోజులుగా ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట రిలే నిరాహర దీక్ష చేపడుతున్న కంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు శుక్రవారం పాడేరు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విధుల్లో నుంచి తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వీరు ఆందోళన చేపడుతున్నారు. ఎపిడమిక్ సీజన్‌లో తమ సేవలను వినియోగించుకున్న అధికారులు ప్రస్తుతం తమను విధుల నుంచి తొలగించి అన్యాయం చేసారని వారు వాపోతున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ర్యాలీలో నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ల సంఘం నాయకులు కె.లక్ష్మణరావు, ఎస్.బాలయ్య, సుమాంజలి, వెంకటలక్ష్మి, గంగమ్మ, సత్యారావు, సి.ఐ.టి.యు. నాయకుడులు ఎల్.సుందరరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీకి సత్వర చర్యలు
పాడేరు, డిసెంబర్ 9: సామాజిక భద్రతా పించన్ల పంపిణీకి సత్వర చర్యలు తీసుకోవాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ బ్యాంకు అధికారులకు సూచించారు. పలు శాఖల బ్యాంకు అధికారులు, వెలుగు అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధి అధికారులు, వెలుగు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులకు సకాలంలో ఫించన్లు పంపిణీ చేయడమే కాకుండా వారితో బ్యాంకు ఖాతాలను ప్రారంభింపచేయాలని చెప్పారు. పించన్ల పంపిణీకి బ్యాంకు అధికారులు సహకరించాలని ఆయన కోరారు. ఎం.పి.డి.ఒ. పరిధిలో పించన్ల పంపిణీకి ఎంతమేరకు నిధులు అవసరవౌతాయో బ్యాంకు అధికారులు లేఖ ద్వారా తెలియచేయాలని ఆయన చెప్పారు. బ్యాంకు ఖాతాలు లేని లబ్ధిదారులకు చెక్కులు లేదా నగదు రూపంలో పించన్ల పంపిణీ చేసేలా ఎం.పి.డి.ఒ.లతో చర్చించాలని వెలుగు అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీలోని పదకొండు మండలాల్లో 4 వేల 514 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రవిసుభాష్ ఆదేశించారు. ఈ సమావేశంలో వెలుగు ఎ.పి.డి. సుబ్బారావు, యూనియన్ బ్యాంకు మేనేజర్ ఎస్.శ్రీనివాసరావు, ఎస్.బి.ఐ., గ్రామీణ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.