విశాఖ

మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, డిసెంబర్ 9: విశాఖ మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం లంబసింగిలో ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా, శుక్రవారం ఏడు డిగ్రీలు నమోదైంది. చింతపల్లిలో గురువారం 7.5 డిగ్రీలు, శుక్రవారం 8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుఫాన్ వలన ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. దీనికి తోడు పొగ మంచు కురుస్తుండడం గిరిజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అనారోగ్యంతో ఉన్న గిరిజనులు పొగ మంచుతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం మూడు గంటల నుండి ప్రారంభమవుతున్న పొగ మంచు మరుసటి రోజు 11 గంటలకు కూడా తగ్గడం లేదు. ఫలితంగా ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. ఉదయం 11 గంటలైన సూర్యకిరణాలు రాకపోవడంతో రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకో లేక పోతున్నారు. చలి తీవ్రత, పొగ మంచు కారణంగా మన్యంలో జరిగే వారపు సంతలు వెలవెల పోతున్నాయి. ఒక వైపు పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర కష్టాలు , మరో వైపు పొగ మంచు , చలి తీవ్రత గిరిజనులను మరిన్ని అవస్థలకు గురి చేస్తున్నాయి. తుఫాన్ ప్రభావం కారణంగా రానున్న రెండు,మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం వాతావరణ శాస్తవ్రేత్త ప్రవీణ్ తెలిపారు.

నేడు శూలాల మహోత్సవం
అరకులోయ, డిసెంబర్ 9: అరకులోయ పట్టణంలో ఈ నెల 10వ తేదీ శనివారం శ్రీ విజయవాడ కనకదుర్గ చంఢీయాగ శూలాల మహోత్సవం నిర్వహిస్తున్నట్టు శ్రీ గురు భవానీలు చందు, దుర్గాప్రసాద్, వీరభద్రరావు తెలిపారు. శుక్రవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ స్థానిక నాలుగు రోడ్ల కూడలి సమీపంలో శూలాల మహోత్సవం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ నెల 13వ తేదీన వాలీబాల్ మైదానంలో పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. ఈ మేరకు భక్తులందరూ కార్యక్రమాల్లో తప్పనిసరిగా హాజరుకావాలని శ్రీ గురు భవానీలు కోరారు.