విశాఖ

‘రోగులకు మెరుగైన వైద్యం అందజేయాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 9: ఎన్టీఆర్ వైద్యాలయానికి గ్రామీణ ప్రాంతాలనుండి అనేక వ్యాధులతో బాధపడుతూ వచ్చే బాధితులకు మెరుగైన వైద్యం అందించి మందులు అందజేయాలని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎన్టీఆర్ వైద్యాలయం సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఎన్టీఆర్ వైద్యాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పీలా గోవింద్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగిని అన్నిరకాల పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వైద్య సేవలను అందించేందుకు వైద్యులు, సిబ్బంది చొరవ చూపాలన్నారు.
అలాగే ఆసుపత్రిలో బార్నింగ్ వార్డులో ఏసి ఏర్పాటు చేయాలని, డెంటల్ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన తనకు ఉందన్నారు. ఆసుపత్రిలో అందజేస్తున్న వైద్య సేవలను ప్రజలకు తెలియాల్సినవసరం ఉందన్నారు. అధునాతనమైన వైద్య సేవలపై రోగులకు అవగాహన లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి డబ్బులను వృథాగా ఖర్చుచేస్తున్నారన్నారు. నూతన సంవత్సరం నుండి కొత్త విధానాన్ని, ఉచిత వైద్య విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో అధునాతనమైన వైద్యం అందజేస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పిస్తే ముందుముందు రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. అందుకు అనుగుణంగానే ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలోనే భర్తీచేసేందుకు కృషిచేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్‌మోహనరావు, సింహాచలంనాయుడు, దేశం నాయకులు మళ్ల సురేంద్ర, కొణతాల వెంకట్రావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, బిఎస్‌ఎంకె జోగినాయుడు, తాకాశి ఉమామహేశ్వరరావు, పచ్చికూర రాము తదితరులు పాల్గొన్నారు.
తాటాకు ఇల్లు దగ్ధం* రూ.లక్ష ఆస్తినష్టం

కొయ్యూరు, డిసెంబర్ 9: మండలంలోని పెదమాకవరం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో నర్సి బెన్నాస్వామికి చెందిన తాటాకు ఇల్లు దగ్ధమై సుమారు లక్షరూపాయల మేర ఆస్థినష్టం సంభవించింది. ఈసంఘటనలో ఇంట్లోని వస్తు సామగ్రి, తిండి గింజలు, ఫర్నీచర్ సర్వం అగ్నికి ఆహుతై బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. గ్రామస్తులు సమయానుకూలంగా స్పందించడంతో గ్రామానికి పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.