విశాఖ

నేటి నుండి మూడురోజులు బ్యాంకులకు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుప్రభావంతో గడిచిన నెలరోజులు నుండి నగదు కోసం ప్రజలు బ్యాంకులు, ఏటిఎం కేంద్రాలు చుట్టూ తిరిగినప్పటికే సమయం సరిపోతుంది. తమ దగ్గర ఉన్న పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసారు. అనంతరం తిరిగి నగదు తీసుకోవడానికి ప్రభుత్వం అనేక ఆంక్షలు విదించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బ్యాంకులు నుండి వారానికి 24వేలు డ్రా చేసుకోవచ్చని ఉన్నప్పటికీ నగదు కొరత కారణంగా కొన్ని బ్యాంకుల్లో నాలుగువేలు, మరిరొన్ని బ్యాంకుల్లో పదివేలు మించి ఇవ్వకపోవడంతో ప్రజలు ప్రతీరోజు నగదు కోసం బ్యాంకులు వద్ద పడిగాపులు పడవలసిన పరిస్థితి ఉంది. రెండవ శనివారం, ఆదివారం, సోమవారం ముస్లింల పండుగ కావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు సెలవులు ప్రకటించాయి. గత నెల రోజులుగా సాదారణ రోజుల్లోనే కొన్ని బ్యాంకులు, ఏటిఎం కేంద్రాల్లో ప్రజలకు నగదు అందడంలేదు. మరి సెలవురోజుల్లో కేవలం ఏటిఎం కేంద్రాల్లో వచ్చే రెండువేలు రూపాయలైనా తీసుకోవడానికి నగదు ఉంటుందా లేదా అనేదానిపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శుక్రవారం పట్టణంలో ఉన్న అన్ని బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి. ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్, ఉడ్‌పేట ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బిహెచ్ బ్రాంచ్ తదితర బ్యాంకులు సైతం నగదు కోసం వచ్చిన ఖాతాదారులతో కిక్కిరిసాయి. ఏటిఎం కేంద్రాలు వద్ద నగదు కోసం వచ్చినవారు మెయిన్ రోడ్డుపై క్యూలైన్లు కట్టకలసిన పరిస్థితి నెలకొంది. పట్టణంలో ఏ ఏటిఎం కేంద్రం చూసినా రెండుగంటలు మించి పనిచేయడం లేదు. అనకాపల్లి పట్టణంలో అన్ని శాఖలకు చెందిన సుమారు 30 ఏటిఎం కేంద్రాలు ఉన్నప్పటికీ సగం ఏటిఎం కేంద్రాలు పనిచేయడం లేదు. మిగిలినవి కూడా అంతంత మాత్రంగా పనిచేయడంతో ప్రజలు నగదు కోసం వెంపర్లాడుతున్నారు.