విశాఖ

గిరిజన ప్రాంతాల్లో కలెక్టర్ విస్తృత పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న అరకులోయ మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం విస్తృతంగా పర్యటించారు. పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పథకాలను పర్యవేక్షించారు. నిర్మాణ దశలో ఉన్న తాగునీటి పథకాలను పరిశీలించి పలు సూచనలు చేసారు. తాంగులగుడ గ్రామంలో నిర్మిస్తున్న సి.సి.రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. గ్రామంలో మురుగు కాలువలు లేకపోవడంతో అధికారులను నిలదీసి వెంటనే డ్రైనేజి నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. మంచినీటి పథకాన్ని పరిశీలించి నెల రోజుల్లో గా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసారు. వికలాంగులకు ఇంటి వద్దకు పింఛన్లు తీసుకువచ్చి చెల్లించాలని ఆయన ఆదేశించారు. పెదలబుడు గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో ఆయన ముచ్చటించారు. అనంతరం గ్రామ రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ పెదలబుడు పంచాయతీలోని నిరుపేద గిరిజనులకు ప్రత్యేక కోటా కింద 450 పక్కా గృహాలు మంజూరైనట్టు తెలిపారు. ఈ గృహాల నిర్మాణాలను రెండు మూడు నెలల్లో పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న పంచాయతీలోని 22 గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పెదలబుడు సందర్శించేలోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ వెంకటరెడ్డిని నియమించినట్టు ఆయన తెలిపారు. నెలలో మూడు పర్యాయాలు దత్తత పంచాయతీలో జాయింట్ కలెక్టర్ పర్యటించి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ గిరిజనులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ, జెడ్పీటీసీ కూన వనజ, సర్పంచ్ సమర్డి గులాబి, జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరెడ్డి, పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి. రవిసుభాష్, వైద్య విధానపరిషత్ కో-ఆర్డినేటర్ బి.కె.నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి సరోజిని, డి.ఆర్.డి.ఎ. పి.డి. సత్యసాయి శ్రీనివాస్, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు ఉ ద్యానవన అధికారి ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంప్రసాద్, గృహ ని ర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్, ఎం.పి.డి.ఒ. ఎస్.ప్రేమాకరరావు, తాహశీల్ధార్ నాగభూషణరావు, పలు శాఖల అధికారులు, దేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.