విశాఖ

గ్రూప్-2,3 అభ్యర్థులకు ఉచిత కోచింగ్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, డిసెంబర్ 10: గ్రూప్-2,3 నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల్లో ఈ ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శనివారం నర్సీపట్నంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్-2,3 దరఖాస్తు చేసుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డి. ఆర్.డి. ఎ. ద్వారా నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో ఈనెల 15వ తేదీ నుండి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లక్ష్మయ్య కోచింగ్ సెంటర్ సౌజన్యంతో ఎల్.సి.డి. ప్రొజెక్టర్‌ల ద్వారా పాఠాలు బోధిస్తారన్నారు. ఈతరగతులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు , తిరిగి రెండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయన్నారు. 15వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రిలిమ్‌నరీ పరీక్షలకు ఈశిక్షణ ఉంటుందని, మెయిన్స్‌కు ఎంపికైన వారికి విశాఖపట్నంలో శిక్షణ ఇస్తామన్నారు. నర్సీపట్నంలో వంద మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చే సౌకర్యం ఉందని, 60 శాతం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారని ఆయన వివరించారు. సుమారుగా 500 గంటల పాటు జరిగే శిక్షణలో ప్రశ్నాపత్రాలు, ఆన్‌లైన్ టెలీకాస్ట్ ద్వారా ప్రతీరోజు ఇస్తారని, స్టడీ మెటీరియల్‌ను కూడా అందజేస్తారని తెలిపారు. ఈప్రాంత అభ్యర్థులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్ 9966908399 ద్వారా సంప్రదించాలన్నారు. అలాగే అనకాపల్లి ప్రాంత అభ్యర్థులు గౌరీ గ్రంథాలయం , నిధానందొడ్డి, గవరపాలెం, అనకాపల్లి ఫోన్ 7396205684 నెంబర్‌ను, విశాఖపట్నం వారు డి. ఆర్.డి. ఎ. కార్యాలయం, ఎం.వి.పి. కాలనీ ఫోన్ 7013303941 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.