విశాఖ

తుని-సీలేరు-సబ్బవరానికి జాతీయ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, డిసెంబర్ 10: సీలేరు నుండి నర్సీపట్నం మీదుగా సబ్బవరం వరకు వంద అడుగుల జాతీయ రహదారి తో పాటు సీలేరు నుండి నర్సీపట్నం మీదుగా తుని వరకూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ జాతీయ రహదారులు నర్సీపట్నం మెయిన్ రోడ్డు మీదుగా వంద అడుగుల వెడల్పుతో విస్తరణ చేపడతారన్నారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సీలేరు నుండి నర్సీపట్నం మీదుగా తూర్పుగోదావరి తుని వరకు జాతీయ రహదారిగా విస్తరిస్తారన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్‌తో పూర్తి స్థాయి చర్చలు జరపాల్సి ఉందన్నారు. మాకవరపాలెం మండలం రామన్నపాలెం వద్ద ఆహార ఉత్పత్తుల ఎగుమతి కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంజూరు చేసారన్నారు. దుబాయ్‌కు చెందిన ఆలానా కంపెనీ ఏర్పాటు చేసే ఈ కర్మాగారంలో కూరగాయలు, పండ్లు, మాంసం ఉత్పత్తులను శీతలీకరించి విదేశాలకు ఎగుమతులు చేపడతారన్నారు. ఈఫ్యాక్టరీ ఏర్పాటు వలన నాలుగువేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, 350 మంది యువతులకు ప్రొసెసింగ్‌లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారని వివరించారు. ఈఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇప్పటికే 109 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతాంజలి ఔషధ సేకరణ, ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నాతవరం మండలం సరుగుడు వద్ద 100 ఎకరాల స్థలాన్ని గుర్తించామని , త్వరలోనే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి అయ్యన్న తెలిపారు.
8.30 కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు
నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి 8.30 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయగా , రాజ్య సభ్య సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి, అనకాపల్లి ఎం.పి. ముత్తంశెట్టి శ్రీనివాస్ చెరో 50 లక్షలు వంతున అందజేసారన్నారు. పట్టణంలోని శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన కాలనీలకు రోడ్లను నిర్మాణం చేపడతామన్నారు. పెదబొడ్డేపల్లి, బలిఘట్టం ప్రాంతాల్లో 50 లక్షలు వంతున కేటాయించామన్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ఫ్లాన్‌లో 14 లక్షల విలువైన పనులు చేస్తారని వివరించారు.