విశాఖ

అలసత్వం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 23: జిల్లా వ్యాప్తంగా ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తొలి సారిగా కలెక్టరేట్ సమావేశ మందిరంలోఅధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు పరిశీలించేందుకు కేంద్ర బృందం త్వరలో రానుందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఐఎవై, ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనులను కేంద్ర బృందం పరిశీలిస్తుందన్నారు. కేంద్ర బృందం పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మంజూరైన ఎన్‌టిఆర్ గృహా నిర్మాణాలను తక్షణమే ప్రారంభించాలన్నారు. జూన్ 30 నాటికి 80 శాతం నిర్మాణాలు పూర్తి కావాలని, గృహాలను ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో సంబంధిత ప్రజాప్రతినిధులు, స్థానిక కమిటీలతో చర్చించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జివిఎంసి యుసిడి ప్రాజెక్టు అధికారి శ్రీనివాసన్ మాట్లాడుతూ విశాఖ నగరంలోని తూర్పు,పశ్చిమ, దక్షిణం, ఉత్తర నియోజకవర్గాలతో పాటు గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, భీమునిపట్నం నియోజకవర్గాల్లో 8వేల గృహాలను కేటాయించామన్నారు. వీటిలో 6,725 ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించగా, 3,515 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందన్నారు. హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్‌టిఆర్ గ్రామీణ గృహ నిర్మాణానికి సంబంధించి విశాఖపట్నం, పాడేరు, నర్సీపట్నం, డివిజన్‌లో 12,950 ఇళ్లను కేటాయించగా, 12,211 ఇళ్ల నిర్మాణానికి పరిపాలనామోదం లభించిందన్నారు. మంజూరైన ఇళ్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించామన్నారు. ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద 2015-16 సంవత్సరానికి సంబంధించి 8,274 కేటాయించగా, 5,145 ఇళ్లు నిర్మాణం పూర్తికాగా, 3,129 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. హూదూద్ నిర్మాణాలకు సంబంధించి 5,468 గృహాలు మంజూరు కాగా, ఈ సంవత్సరాంతానికి పూర్తవుతాయన్నారు. సమావేశంలో హౌసింగ్ ఇఇ రవి శంకర్, డిఇ ప్రసాద్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.