విశాఖ

శ్రీరామ నామ బహుప్రీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 15: నగరంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందరి ఆరాధ్యదైవమైన శ్రీ సీతారాముల కల్యాణాన్ని చూసేందుకుజనం, భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. జగదాంబ జంక్షన్‌లో ఉన్న శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అయిన అంబికాబాగ్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహాత్స్యం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన విశాఖ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కంభంపాటి హరిబాబు దంపతులు ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే జెడ్పీ చైర్మన్ దంపతులు లాలం భవాని భాస్కర్‌లు, సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ దంపతులు కూడా స్వామి వారి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణాల మధ్య శ్రీ సీతారాముల కల్యాణం వేడుకగా జరిగింది. అనంతరం స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా స్వామి వారిని భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎసిబి డిఎస్పీ రామకృష్ణప్రసాద్, జాయింట్ కలెక్టర్ వెంకటరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. అంతేకాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఈవో ఎస్.జె. మాధవి అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భక్తులందరికీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రంగా దేవాలయంగా పేరుపొందిన ఈస్ట్ పాయింట్ షిరిడీ సాయిబాబు ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మద్దిలపాలెంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.