విశాఖ

నిమ్స్ తరహాలో విమ్స్ నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 15: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (నిమ్స్) తరహాలోనే విమ్స్ ఆసుపత్రిని నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల జాతీయ స్థాయిలోనే నియామకాలు జరపాల్సి ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా వైద్యులు ఇక్కడ పని చేసేందుకు రావచ్చు. ఈ విధంగా నియమించే వైద్యుల్లో ఎక్కువ శాతం మంది సీనియారిటీ కలిగి ఉండే వారినే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నియమించబడే వైద్యులు విమ్స్ ఆసుపత్రికి సమీపంలోనే నివాసులు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎటువంటి పరిస్థితుల్లోను ప్రైవేటుగా ప్రాక్టీస్ నిర్వహించడం అనుమతించబడదు. ప్రైవేటు ప్రాక్టీస్‌ను నిషేధిస్తుంది. ఇటువంటి విధానాలకు లోబడి మాత్రమే వైద్యులు తమ సేవలను అందించాల్సి ఉంటుంది. వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు, ఆయా కేటగిరీలకు చెందిన సిబ్బంది జీత,్భత్యాలకు ప్రతి ఏడాది కనీసం 80 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుందనేది అంచనా. తిరుపతిలో ఉండే సిమ్స్ తరహాలో నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. అయితే గత కొంతకాలంగా ఇది నష్టాల్లో ఉన్నట్టు తెలిసింది. అందువల్ల దీనిని అనుసరించే వీలు లేకుండా పోయింది. ఇపుడు ఇక నిజాం తరహాలోనే ఇక్కడ విమ్స్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.