విశాఖ

విశాఖ రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 15: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే విశాఖ రైల్వేస్టేషన్‌లో వై-ఫై సేవలు మరింత విస్తృతమవుతున్నాయి. గూగుల్ ద్వారా సరికొత్త ప్రయోగాన్ని ఆవిష్కరించింది. ఫ్రీ హై-స్పీడ్ పబ్లిక్ వై-ఫై సేవలను శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా రోజుకి 1.9 లక్షల మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తోన్న గూగుల్ సంస్థ 1.5 మిలియన్ల భారతీయులకు ఈ విధమైన సేవలు అందించగలుగుతోంది. తొలి ప్రయోగం ఈ ఏడాది జనవరిలో ముంబై సెంట్రల్‌లో జరిగింది. ఆ తరువాత ప్రయాణికుల కోరికపై పూణే, భువనేశ్వర్, భోపాల్, రాంచి, రాయ్‌పూర్, విజయవాడ, కాచిగూడ (హైదరాబాద్), ఎర్నాకులం జంక్షన్ (కోఛి), విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో ఈ వై-ఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగలిగింది. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రాజెక్టును 100 ప్రపంచ దేశాలకు సంబంధించి అత్యధిక ప్రయాణీకుల రద్దీ కలిగి ఉండే రైల్వేస్టేషన్లలో ఈ సదుపాయాన్ని విస్తరిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా హై-స్పీడ్ బ్రాడ్ బేండ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.