విశాఖ

రాష్ట్భ్రావృద్ధికి సిఎం చంద్రబాబు కృషి అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీడికాడ, ఏప్రిల్ 16: రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో కృషిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. మండలంలో జి కొత్తపల్లి గ్రామంలో చీడికాడ, మాడుగుల మండ ల కార్యవర్గ అనుబంధ కమిటీల ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ అన్నారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో పాలన చేసిందని ఆరోపించారు. 1983-2004 వరకు మాడుగుల ఎమ్మెల్యేగా రెడ్డి సత్యనారాయణ అవినీతి లేకుండా పనిచేసారని అన్నారు. 2004-2009 వరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌లోకి వెళ్లిందని, ఐదు సంవత్సరాలు అప్పటి ఎమ్మెల్యే అవినీతిని ప్రోత్సాహించారని అందుకే 2009, 2014 ఎన్నికల్లో అలాం టి వ్యక్తి చోడవరంలో రెండుసార్లు ఓడించారని అన్నారు. నిజాయితీతో పనిచేస్తే ఏ వ్యక్తినైనా ప్రజలు ఆదరిస్తారని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో తాను కొన్ని పొరపాట్లు చేయడం వలన ఓటమి చెందానన్నారు. అలాంటివి మరలా పునరావృతం కాకుండా ఉం డేందుకు కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకుని 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. మండల కమిటీల ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు కార్యకర్తలు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ తాను కొన్ని పొరపాట్లు చేయ డం వలనే 2014 ఎన్నికల్లో రామానాయుడు ఓడిపోయాడన్నారు. వచ్చే ఎన్నికల్లో రామానాయుడి గెలుపు కోసం కృషిచేస్తానన్నారు.అనంతరం మాడుగుల, చీడికాడ మండలాల కమిటీల ఎన్నికలు జరిగాయి. మాడుగుల మండ ల కమిటీల ఎన్నికల్లో మాజీ ఎంపీపి పుప్పాల అప్పలరాజు, ప్రస్తుత మండల శాఖ అధ్యక్షులు, సిడిసి చైర్మన్ మజ్జి తాతబాబులు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరువర్గీయులు కూడా తమ నేతలకే పార్టీ మండల శాఖ ఇవ్వాలని నినాదాలు చేసారు. దీంతో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కల్పించుకుని శాంతియుతంగా ఎన్నిక జరుపుకోండని తెలిపినా ఇరువర్గీయులు శాంతించలేదు.
* తెలుగు తమ్ముళ్ల ఘర్షణ
మజ్జి తాతబాబుకే మండల పార్టీ ఇవ్వాలని ఆయన వర్గీయులు, అప్పలరాజుకే మండల పార్టీ పదవి ఇవ్వాలని నినాదాలు హోరెత్తించాయి. స్టేజిపై నుండి ఇరువర్గాల కార్యకర్తలు దిగి ఘర్షణకు దిగారు. ఘర్షణలో ఏం జరుగుతుందని కొంతమంది కార్యకర్తలు అక్కడి నుండి పరుగులు తీసారు. తెలు గు తమ్ముళ్ల తోపులాట, ఘర్షణ తగ్గకపోవడంతో కల్పించుకున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాడుగుల మండల కమిటీ ఎన్నిక 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరువర్గాల వారు శాంతించారు.
* చీడికాడ మండల కమిటీ ఏకగ్రీవం
చీడికాడ మండల దేశం పార్టీ ఎన్నిక ఏకగ్రీవమయింది. మండల కార్యకర్తలు ఏకతాటిపై పాత కమిటీనే మరలా కొనసాగించాలని తీర్మానించారు. దీంతో మరలా టిడిపి అధ్యక్ష, కార్యదర్శులుగా పేరపు కొండబాబు, పంచాడ దాలినాయుడు మూడు పర్యాయం ఎన్నికయ్యారు. వీరిని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అభినందించారు.