విశాఖ

దీటైన నేత కోసం కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఏప్రిల్ 30: తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లాలో సంపూర్ణమైన మెజార్టీతో ఉంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది. అయితే సంస్థాగతంగా జిల్లాలో పార్టీని ఒకేమాట ఒకే బాటపై నడిపించే నేత లు కరువయ్యారు. జిల్లా పార్టీ నేతలు మధ్య సమన్వయం కుదర్చడం, పార్టీని ఐక్యంగా నడిపించే నేతకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు. వచ్చే పదవ తేదీలోగా జిల్లా పార్టీ అధ్యక్షుని నియామకం జరగనుంది. అయితే జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తిరిగి ఆ పదవిలో కొనసాగేందుకు నిరాశక్తత ప్రదర్శిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే విషయంలో పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు తనకు తగురీతిలో సహకరించడం లేదని ఇప్పటికే పలు పర్యాయాలు అధినేత చంద్రబాబుకు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు పప్పల చలపతిరావు ఫిర్యాదు చేసారు. వయోభారం పైబడటం, అవసరమైతే కమాండ్ చేసే సామర్ధ్యం కొరవడటం తదితర కారణాల వలన జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చాలని అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు తహతహలాడుతున్నారు. యలమంచిలి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర వహించిన సుందరపు విజయ్‌కుమార్ సైతం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ ఇరువురు జిల్లామంత్రి అయ్యన్నకు అత్యంత విధేయులు కావడం విశేషం. గతంలోనే జిల్లా పార్టీ అధ్యక్షులుగా గవిరెడ్డి రామానాయుడును కొనసాగించాలని మంత్రి అయ్యన్న సర్వశక్తులు ఒడ్డి కృషిచేసారు. అయితే ప్రత్యర్ధ వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన సన్నిహితులు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని గవిరెడ్డికి ఇచ్చేందుకు వ్యతిరేకించారు. ఈ పర్యాయం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ చైర్మన్ లాలం గంగాభవానీ భర్త భాస్కరరావుకు కట్టబెట్టాలని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీచైర్మన్, డిసిసిబి చైర్మన్, విశాఖఢెయిరీ చైర్మన్ తదితర కీలక పదవుల్లో ఉన్న నేతలంతా ఉన్నారు. అదే నియోజకవర్గం నుండి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టే విషయంలో ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆ విధంగా భావిస్తే సుందరపు విజయ్‌కుమార్‌కు, అటు లాలం భాస్కరరావులను జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రేసునుండి తప్పుకునే పరిస్థితి ఉంది. ఇదిలావుండగా అనకాపల్లి పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వరుసగా ఎనిమిది పర్యాయాలు పనిచేసి పార్టీని కష్టకాలంలో సైతం అనకాపల్లి అసెంబ్లీలో దేశం పార్టీని బలోపేతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డి కృషిచేసిన పట్టణ దేశం అధ్యక్షులు బుద్ద నాగజగదీష్ సైతం జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. నాగజగదీష్‌కు పార్టీ అధినేత చంద్రబాబుతోనే నేరుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదిలావుండగా గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తదితరులు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి రేసులో లేకపోలేదు. ఇరువురు మంత్రులు మధ్య ఏకాభిప్రాయంతోనే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే అభ్యర్థి ఎవరనే నిర్ణయాన్ని అధినేత చంద్రబాబు తీసుకుంటారనడం అతిశయోక్తి కాదు.