విశాఖ

త్వరలో జిల్లాలో 200 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్. రాయవరం, సెప్టెంబర్ 19: జిల్లాలో ఖాళీగా ఉన్న 200 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ఎపిపిఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని జిల్లా పంచాయతీ అధికారి కృష్ణవేణి అన్నారు. మంగళవారం ఆమె ఎస్. రాయవరం వచ్చిన సందర్భంగా స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలోని 952 పంచాయతీలను 588 క్లస్టర్లుగా విభజిస్తూ ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు సవరణలు చేసి 700 పంచాయతీ క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకుని తిరిగి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఘన, వ్యర్ధ నిర్వహణ ప్లాంట్‌లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసామని ఆమె తెలిపారు. 952 పంచాయతీల్లో గృహాలకు జియో ట్యాగింగ్ 72శాతం పూర్తయిందని, మిగిలిన ఇళ్లకు త్వరలోనే జియో ట్యాగింగ్ పూర్తిచేస్తామని ఆమె తెలిపారు. స్థానిక పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులతో ఘన, వ్యర్ధ నిర్వహణ కేంద్రాలకు ఏర్పాటు చేసిన సమావేశంలో డిపివో కృష్ణవేణి మాట్లాడుతూ చెత్తాచెదారం రహిత గ్రామాలుగా తయారుచేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్ధేశ్యమని, ఇప్పటికే పలు గ్రామాల్లో ఘన, వ్యర్ధ నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేసామని, నిధులను గ్రామ పంచాయతీల్లోను ఈ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి గ్రామం స్వచ్చతగా, ఆరోగ్య గ్రామంగా మలుచుకోవాలని ఆమె సూచించారు. ఈ సంవత్సరం మొదటి విడతగా ఎంపిక చేసిన గ్రామాల్లో పనులు పూర్తిచేయాలని సర్పంచ్‌లను కోరారు. ఈ కేంద్రాల నిర్మాణంకు స్థల సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, రెవెన్యూ అధికారులతో చర్చించి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు ఉందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో నర్సీపట్నం డిఎల్‌పివో శిరీషారాణి, ఎంపిడివో డిడి స్వరూపారాణి, ఇవోపిఆర్‌డి కొండలరావు, సర్పంచ్‌లు ఆదిమూర్తి, వెంకట్రావు, పాపారావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలి

నర్సీపట్నం(టౌన్), సెప్టెంబర్ 19: తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కంచె ఐలయ్య రచించిన పుస్తకాన్ని నిషేధించాలని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం ఆర్యవైశ్యులు సంఘం ప్రతినిధులు ఆయనను కలిసి వినతి పత్రం అందజేసారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఆర్యవైశ్యులు భారీ ఉద్యమాలు చేపడుతున్నారన్నారు. ఆర్యవైశ్యులు తమ నైతిక విలువల కోసం , గౌరవం కోసం పోరాడుతున్నారన్నారు. ఐలయ్య మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు. ఆర్యవైశ్యుల మనోభాలను కించపరిచే విధంగా రాసిన పుస్తకాన్ని తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వలు నిషేధించాలన్నారు. ఎవరికైనా మాట్లాడే స్వేచ్చ ఉంటుందని, అయితే ఒక కులాన్నో, మతాన్ని కించపరిచే విధంగా ఎవ్వరూ వ్యవహరించకూడదన్నారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు పాల్గొన్నారు.
కంచె ఐలయ్యను తక్షణమే అరెస్ట్ చేయాలని , ఆయన రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ఆర్యవైశ్యులు నిరసన ర్యాలీ చేపట్టారు . స్థానిక వాసవీ కళ్యాణ మండపం నుండి ఐదురోడ్ల జంక్షన్ మీదుగా అబీద్ సెంటర్, శ్రీకన్య కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. నిరసన కార్యక్రమంలో భాగంగా ఐలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. కంచె ఐలయ్యను అరెస్ట్ చేయాలని, ఆర్యవైశ్యులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదించారు. ర్యాలీ సందర్భంగా ఆర్యవైశ్యులంతా తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు . ర్యాలీకి వైకాపా నాయకులు కోనేటి రామకృష్ణ, గొలుసు నర్సింహమూర్తి తదితరులు సంఘీభావం తెలిపారు. అలాగే పురపాలక సంఘం వైస్‌చైర్మెన్ సన్యాసిపాత్రుడు ఆర్యవైశ్యులను కలిసి తమను మద్దతు తెలియజేసారు. ఈకార్యక్రమంలో డాక్టర్ సి. ఎస్.కుమార్, వెలగా నారాయణరావు, జాలుమూరి జోగారావు,కౌన్సిలర్ బంగార్రాజు,సుతాపల్లి శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.