విశాఖ

ఆధార్‌తో అనుసంధానించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, ఏప్రిల్ 24: ఆధార్‌తో అనుసంధానం కాని బాలికా సంరక్షణ పథకం లబ్దిదారులు తక్షణం స్థానిక ఐసీడీ ఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని ఐసీడీ ఎస్ పి. ఓ. కె. ఇందిరాదేవి విజ్ఞప్తి చేసారు. మంగళవారం ఆమె స్థానిక ప్రాజెక్టు కార్యాలయంలో మాట్లాడుతూ పాజెక్టు పరిధిలో గల కోటవురట్ల, మాకవరపాలెం, నాతవరం మండలాల్లో 2005-18 సంవత్సరాల మధ్య మూడువేల మందికి బాలికా సంరక్షణ బాండ్లు అందించామన్నారు. వీరిలో 150 మంది లబ్దిదారులు ఆధార్‌తో అనుసంధానం కాలేదన్నారు. వీరందరూ తమ కార్యాలయానికి వచ్చి ఆధార్ , ఫోన్ నెంబర్ల వివరాలను అందించాలన్నారు. 10 రోజుల్లో వివరాలు అందజేయకపోతే 150 మంది లబ్దిదారులకు ఈపథకం రద్దవుతుందని హెచ్చరించారు.

జిల్లాలో ఉత్తమ ఎంపీపీగా సన్యాసిదేముడు
నాతవరం, ఏప్రిల్ 24: జిల్లాలో నాతవరం మండలానికి ఉత్తమ ఎంపీపీగా చిటికెల సన్యాసిదేముడు(బాబులు) ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. మంగళవారం రాజధానిలో జరిగిన పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈవేడుకల్లో విశాఖ జిల్లాలో 43 మంది ఎంపీపీలు ఉండగా నాతవరం మండలాభివృద్ధికి శ్రమించిన దేముడిని ఉత్తమ ఎంపీపీగా చంద్రన్న ఎంపిక చేయడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేసారు. అదే విధంగా మండలంలో ఉత్తమ పంచాయతీలుగా గునిపూడి సర్పంచ్ సుర్ల స్వామినాయుడు, గన్నవరం సర్పంచ్ సింగంపల్లి జగదాంబలను విశాఖలో జరిగిన జెడ్పీ చైర్మెన్ లాలం భవానీ ఆధ్వర్యంలో పంచాయతీ అభివృద్ధి కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. నాతవరం మండలాభివృద్ధికి ఈ అవార్డులు రావడంతో జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, మండల దేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.రమణ, ఎంపీడీ ఓ యాదగిరేశ్వరరావు, తహశీల్దార్ కనకారావు, ఆర్.డబ్ల్యు. ఎస్. జె. ఇ .జైరామ్, ఎం ఇ. ఓ. అమృతకుమార్‌తో పాటు తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు , నాయకులు ఆనందం వ్యక్తం చేసారు.