విశాఖ

చెత్త బుట్టలు లేని దుకాణాలు సీజ్ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 15: విశాఖ ఏజెన్సీలోని వ్యాపారులు తమ దుకాణాల ఎదుట చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ డి.కె.బాలాజీ హెచ్చరించారు. దుకాణాల ఎదుట చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకోని వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే ఏజెన్సీలోని అన్ని మండలాల తహశీల్ధార్లకు, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన ఆదివారం విలేఖరులకు తెలిపారు. ప్రజా జీవనానికి ఆరోగ్య సమస్యలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. వ్యాపారులు చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ నెల 17వ తేదీ వరకు గడువు ఇచ్చామని, ఈలోగా వీటిని ఏర్పాటు చేసుకోకపోతే 18వ తేదీ నుంచి దుకాణాల సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని అన్ని దుకాణాల వ్యాపారులు, హోటళ్ల యజమానులు గుర్తించి తప్పనిసరిగా చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్లాస్టిక్ సంచుల్లో సరుకులు సరఫరా చేసే వ్యాపారులపై కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించాలని ఆయన చెప్పారు. ఏజెన్సీలోని మండల కేంద్రాలలో వ్యాపారాలు సాగించే వర్తకులు, తోపుడు బళ్లపై వ్యాపారాలు చేసుకునే వారు ప్లాస్టిక్ సంచులను నిరోధించాలన్నారు. డ్రైనేజీలు, రోడ్లమీద వ్యర్థ పదార్థాలను వేసి ఆరోగ్య సమస్యలు సృష్టించే వారిపై క్రిమినల్ ప్రోసిజర్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. హోటళ్లలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే వినియోగదారులకు సరఫరా చేయాలని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎంతటి వారినైనా విడిచిపెట్టమని ఆయన అన్నారు. వ్యర్థ పదార్థాలను నిర్లక్ష్యంగా రోడ్లపై వేసే వారు చట్టపరంగా శిక్షార్హులని ఆయన చెప్పారు. మండల కేంద్రాలలో డ్రైనేజీలను మూసివేసి వాటిపై దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారిపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. డ్రైనేజీలను ఆక్రమించడం నేరమని, డ్రైనేజీలలో చెత్త, వ్యర్థ పదార్థాలను వేయడంవలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించి స్వచ్ఛ మన్యంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరారు. ఏజెన్సీలోని పదకొండు మండలాల్లో దోమ తెరలను పంపిణీ చేశామని, వీటిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించి దోమకాటు నుంచి రక్షణ పొందాలన్నారు. నివాస ప్రాంతాలలో నీటి నిల్వలు, వ్యర్థ పదార్థాలు, నిరుపయోగమైన వస్తువులను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలంతా ప్రభుత్వ యంత్రాంగంతో సహకరించాలని బాలాజీ కోరారు.

కె.కె.లైన్‌లో విరిగిపడిన కొండ చరియ
* నిలిచిన రైళ్లు
అరకులోయ, జూలై 15: కొత్తవలస-కిరండోలు రైలు మార్గంలో ఆదివారం ఉదయం కొండ చరియ విరిగిపడడంతో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిచి ముద్దయిన కె.కె.లైన్‌లోని కొండచరియలు చిమిడిపల్లి-బొర్రా రైల్వే స్టేషన్ల మధ్య 62/2 కిలోమీటరువద్ద విరిగిపడింది. దీంతో ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ లైన్ తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో విశాఖపట్నం నుంచి కిరండోలు వెళ్లే పాసింజర్ రైలును చిమిడిపల్లి రైల్వే స్టేషన్‌వద్ద నిలిపివేయాల్సి వచ్చింది. కిరండోలు నుంచి విశాఖపట్నంకు ఐరన్ లోడ్‌ను తీసుకువెళ్లే గూడ్స్ రైళ్లను కూడా నిలిపివేశారు. అయితే రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ ప నులు చేపట్టి రైళ్ల రాకపోకలను మధ్యా హ్నం నుంచి పునరుద్ధరించారు.