విశాఖ

కొత్తమల్లంపేటలో జ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొలుగొండ, ఆగస్టు 14: మండలంలో కొతమల్లంపేటలో జ్వరాలు విజృంభించాయి. గ్రామంలోని 30 మంది రోగులు వరకు వైరల్, విష జ్వరాలు సోకడంతో గ్రామస్తులు స్థానిక వైద్యాధికారికి సమాచారం అందించారు. దీంతో వైద్యాధికారి శేషారావు తమ సిబ్బందితో కలిసి గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలందించారు. ఈసందర్భంగా వైద్యాధికారి శేషారావు మాట్లాడుతూ ప్రస్తుతం సీజన్‌లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉంటాయన్నారు. జ్వరం సోకిన వెంటనే రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందాలన్నారు. ఏ గ్రామంలోనా జ్వరాలు సోకినట్లేతే తక్షణమే వైద్య సేవలు పొందాలన్నారు. ఈవైద్యశిబిరంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
గొలుగొండ, ఆగస్టు 14: పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎ ఎంసీ చైర్మెన్, మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తజోగుంపేటలోని అడిగర్ల స్వగృహంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అడిగర్ల మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో దేశం పార్టీ విజయానికి కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి శక్తి వంచన లేకుండా పని చేయాలని సూచించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారన్నారు. మంత్రి అయ్యన్న చొరవతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ, చీడిగుమ్మల పీ ఎ సీ ఎస్ అధ్యక్షుడు భీమిరెడ్డి సత్యనారాయణ, దేశం పార్టీ సీనియర్ నాయకులు చిటికెల సాంభమూర్తి, మాజీ సర్పంచ్ సుర్ల సీతారామ్మూర్తితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.