విశాఖ

సుజల స్రవంతి పథకానికి గ్రామాలు ఖాళీ చేయించడంలో ప్రమేయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం, సెప్టెంబర్ 12: సుజల స్రవంతి పథకం నిర్మాణంలో గ్రామాలు ఖాళీ చేయడంలో తన ప్రమేయం లేదని ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు గ్రామసభలో తెలిపారు. ఈపధకం నిర్మాణానికి సర్వేకు ఈనెల 8న తోటకూరపాలెం వచ్చిన పోలవరం ఇంజనీరింగ్ సిబ్బంది గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తోటకూరపాలెం, పంగిడి గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి గ్రామస్తులు వ్యతిరేకించడంతో ఇంజనీరింగ్ సిబ్బంది పలాయనం చిత్తగించారు. తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవిస్తున్న తాము గ్రామాలు ఖాళీ చేయించేందుకు అధికార పార్టీ కుట్ర పన్నిందని పుకార్లు వ్యాపించడంతో ఈ అపవాదు నుంచి బయట పడేందుకు బుధవారం తోటకూరపాలెంలో ఎమ్మెల్యే కె ఎస్ ఎన్‌రాజు బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009లో అప్పటి మంత్రి కె .రామకృష్ణ ప్రతిపాదనల మేరకు సుజల స్రవంతి పథకం నిర్మిస్తున్నామన్నారు. దీనిలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తో పాటు తన ప్రమేయం లేదని ఎమ్మెల్యే రాజు ప్రజలకు వివరించారు. అయితే అప్పట్లో గ్రామాలను ఖాళీ చేయించాలన్న ప్రతిపాదన లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈప్రాజెక్టు నమూనా మార్చి తాజాగా మరో ప్రాజెక్టు రూపొందించిన ప్రతిపాదించిన మేరకు తమ గ్రామాలు ఖాళీ చేయించాలని కుట్ర పన్నారని గ్రామస్తులు తెలిపారు. పాలకులకు తెలియకుండా అధికారులు గ్రామాలను ఖాళీ చేయించాలన్న ప్రకటనకు సాహసం చేయరని గ్రామస్తులు ఎమ్మెల్యే రాజుకు వివరించారు. తక్షణం గ్రామాన్ని ఖాళీ చేయించాలన్న ప్రతిపాదన విరమించుకోవాలని మూకుమ్మడిగా నినాదాలు చేసారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే రాజు గ్రామస్తులతో కమిటీ వేసి ప్రాజెక్టు డిజైన్ మార్పునకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు.

వినాయక చవితికి ముస్తాబవుతున్న గ్రామాలు
చోడవరం, సెప్టెంబర్ 12: వినాయక చవితి ఉత్సవాలకు మండలంలోని ప్రతీ గ్రామం ముస్తాబవుతుంది. చలువ పందిళ్లువేసి విద్యుద్ధీపాలతో అలంకరిస్తున్నారు. హిందువులు భక్తిశ్రద్ధలతో చేసుకునే ప్రధాన పండుగ కావడంతో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా వాడవాడలా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం వినాయక చవితి పండుగ కావడంతో పలుచోట్ల యువకులు మేళతాళాలతో గణపతి విగ్రహాలను తీసుకువస్తున్నారు. అన్నవరం, గాంధీగ్రామం, వెంకయ్యగారిపేట, యడ్లవీధి తదితర ప్రాంతాలలో పందిళ్లు వేసి భారీ సెట్టింగులను ఏర్పాటు చేస్తున్నారు. వినాయక ప్రతిమలతోపాటు ఆయా మండపాలను సైతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో ఉత్సవ కమిటీలు నిమగ్నమయ్యారు. దీంతో ఎక్కడ చూసినా సందడే సందడిగా కనిపించింది.