విశాఖ

వినాయక చవితికి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, సెప్టెంబర్ 12: ప్రధమ పూజ్యుడు విఘ్నాధిపతి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ సాంప్రదాయ బద్దంగా మొదటగా వచ్చే వినాయక చవితి పండుగను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. డౌనూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థి సందీప్ తయారు చేసిన వినాయక మట్టి ప్రతిమ పలువురిని ఆకట్టుకుంది. మండలంలో గల పలు వినాయక ఆలయాల్లో రంగులతోనూ, విద్యుత్ దీపాలతోనూ అలంకరించి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
కోటవురట్ల, సెప్టెంబర్ 12: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.శేషశైలజ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఓటరు నమోదుపై విద్యార్థినీవిద్యార్థులకు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఆమె మాట్లాడుతూ వచ్చే జనవరి 2019 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యేవారందరూ ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వచ్చే ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ఓటర్లు నమోదు ఇది చివరి అవకాశంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా మార్పులు, చేర్పులు తొలగింపు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో రెండు లక్షల 24 వేల 492 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే 291 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటింగ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. విద్యార్థులు ఓటు ప్రాధాన్యతపై నిరక్ష్యరాస్యుల్లో అవగాహన పెంచాలన్నారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జగన్నాధరావు, ఇన్‌చార్జ్ తహశీల్దార్ రమేష్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి
కోటవురట్ల, సెప్టెంబర్ 12: వైసీపీ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు డీవీ ఎస్ రాజు తెలిపారు. బుధవారం మాజీ ఎమ్మెల్సీ డీవీ ఎస్ రాజు క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, నియోజకవర్గం సమన్వయకర్త వీసం రామకృష్ణ , నియోజకవర్గం ప్రచార ఇన్‌చార్జ్ వర్మ, నాయకులు సుధాకర్, తదితరులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశ లో వారు మాట్లడుతూ కావాలి జగన్ రావాలి జగన్ అనే నినాదంతో ఈనెల 15న వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామన్నారు. వైసీపీకి బూత్ కమిటీలే కీలకమన్నారు. వివిధ అంశాలపై బూత్ కమిటీలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు సత్యనారాయణరాజు, చామంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.