విశాఖ

నిరుపయోగంగా ఫాగింగ్ యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, సెప్టెంబర్ 25: దోమల నివారణకు వినియోగించాల్సిన ఫాగింగ్ యంత్రాలు కార్యాలయానికే పరిమితమయ్యాయి. ప్రస్తుతం వ్యాధులు ప్రబలే సీజన్ కావడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. వ్యాధులను నివారించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దోమలపై దండయాత్ర , మలేరియా, డెంగ్యూ నివారణ చర్యలకై ర్యాలీలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా అవగాహనతో పాటు దోమల వృద్ధిని నివారించడం వాటి లార్వాలను నిర్మూలించడం చేయాలి. ఇందుకు వీలుగా మండలానికి రెండు ఫాగింగ్ యంత్రాలు , ఐదు పిచికారి పంపులను ఇటీవల ఐటీడీ ఎ ద్వారా పంపిణీ చేసారు. వీటి వినియోగంపై ఎంపీపీ , ఎంపీడీ ఓ, ఇ ఓ ఆర్‌డీల సమక్షంలో పంచాయతీ కార్యదర్శులకు ప్రయోగాత్మకంగా వివరించారు. వెంటనే వీటిని వినియోగంలోకి తెచ్చి దోమల నిర్మూలన చర్యలు చేపట్టనున్నట్లుగా వారు తెలిపారు. ఇది జరిగి 10 రోజులు కావస్తున్నా వాటిని వినియోగంలోకి తేకపోగా కార్యాలయంలో ఒక మూలన పడేసారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదన్న చందాన వేలాది రూపాయలతో కొనుగోలు చేసిన యంత్రాలు వినియోగించకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో దోమలు వృద్ధితో వ్యాధులు, జ్వరాలు ప్రబలుతూనే ఉన్నాయి. తక్షణం వీటిని వినియోగంలోకి తెచ్చే విధంగా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.
రహదారులతోనే అబివృద్ధి
కొయ్యూరు, సెప్టెంబర్ 25: రహదారుల నిర్మాణంతోనే ప్రాంతాలు అబివృద్ధి చెందుతాయని మంప ఎంపీటీసీ పి.శివరామరాజు అన్నారు. మండలంలోని మంప - గంగవరం రహదారి నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్ధాపన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరహదారి బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 1.72 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇంత వరకు ఈ ప్రాంతానికి సరైన రహదారి లేక వర్షాకాలంలో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ప్రస్తుతం వారందరి కష్టాలు తీరనున్నాయన్నారు. త్వరితగతిన రహదారి మంజూరుకు నివేదికలు సిద్ధం చేస్తూ మంజూరుకు చర్యలు చేపట్టిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజుబాబు, స్థానిక నేతలు సత్తిబాబు, రాంబాబు, జి.సత్యనారాయణ, రామకృష్ణ, గోపాలకృష్ణ తదితర పలువురు పేర్కొన్నారు.

వీ ఆర్ ఓల సంఘం అధ్యక్షునిగా సుదర్శనరావు
కొయ్యూరు, సెప్టెంబర్ 25: మండల వీ ఆర్ ఓల సంఘ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని చిట్టింపాడు వీ ఆర్ ఓ సుదర్శనరావును అధ్యక్షునిగా కొయ్యూరు వీ ఆర్ ఓ పండయ్యను ఉపాధ్యక్షునిగా ఆడాకుల వీ ఆర్ ఓ ఎం శ్రీనివాసరావును కార్యదర్శిగా, రావణాపల్లి వీ ఆర్ ఓ లక్ష్మిని కోశాధికారిగాను, వీ ఆర్ ఓలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీ ఆర్ ఓల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గ నేతలు పేర్కొన్నారు.