విశాఖ

ఆదర్శ గ్రామాలుగా సి.ఎం. దత్తత గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మే 17: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఐ.టి.డిఎ ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్, సబ్ కలెక్టర్ ఎల్. శివశంకర్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. నువ్వగుడ, లింబగుడ, పాతబిస్టుంగుడ, పిట్టమామిడివలస, పెదలబుడు గ్రామాల్లో సుడిగాలిలా పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సిమెంట్ కాంక్రిట్‌రోడ్లు, బోరింగులను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును తెలుసుకున్నారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. నువ్వగుడ, లింబగుడ గ్రామాల్లో తాగునీటి సదుపాయం మెరుగుపరుస్తామని, పక్కా గృహాలు మంజూరు చేస్తామని, పట్టమామిడివలసలో అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని కలెక్టర్ యువరాజ్ గిరిజనులకు హామీ ఇచ్చారు. విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపుతామన్నారు. అంతకుముందు మాదల పంచాయతీ నందివలస సమీపాన హుదూద్ నిర్వాసితులకు నిర్మించనున్న మోడల్ కాలనీ ప్రాంతాన్ని కలెక్టర్, ఐ.టి.డి.ఎ. పి.ఒ., సబ్ కలెక్టర్ పరిశీలించారు. దొరవలస ప్రధాన రహదారి నుంచి మేదర్‌సోలా మీదుగా అంపవల్లి వరకు సుమారు 27 కిలోమీటర్ల మేర తలపెట్టిన రహదారి ప్రాంతాన్ని వారు పరిశీలించారు. మేదర్‌సోల, చిట్టంగొంది బాధిత గిరిజనులు 36 కుటుంబాలకు నందివలస ప్రాంతంలో పక్కాగృహాలు నిర్మించి ఇవ్వనున్నారు. ఒక్కొక్క గృహానికి 3.50 లక్షల రూపాయల వంతుల 36 గృహాలకు కోటి 25 లక్షల రూపాయల ఖర్చు తో హుదూద్ నిర్మాసితులకు గృహాలు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టారు.
రచ్చబంద వద్ద అధికారులతో కలెక్టర్ సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దనున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ పేర్కొన్నారు. సి.ఎం. దత్తత పంచాయ తీ పెదలబుడులోని రచ్చబండవద్ద అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల తో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పం చాయతీ పరిధిలోని 22 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. దత్తత గ్రామాల గిరిజనులు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, విద్యాభ్యాసన, మరుగుదొడ్ల నిర్మాణం, ఆసుపత్రిలో ప్రసవాలు, ఇంకుడు గుంతల తవ్వకాలకు అధిక ప్రాధాన్యతఇవ్వాలన్నారు. పెదలబుడులో ఇంటింటికీ కుళాయిలద్వారా తాగునీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు 25 లక్షలతో పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో 33 బోరింగులు ఏర్పాటుచేశామన్నారు. భవిష్యత్‌లో గిరిజనుల నుంచి పంచాయతీ నీటి పన్నులు వసూలు చేయాలన్నారు. ఉపాధి పనుల్లో జాప్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ యువరాజ్ ఎ.పి.డి. భ్రమరాంబ, ఎ.పి.ఒ. చిన్నారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పనుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసి భవిష్యత్‌లో పద్ధతి మార్చుకోకపోతే ఇంటికి పంపించి వేస్తామని హెచ్చరించారు. అనంతరం పెదలబుడు సమీప కొండవద్ద అటవీ శాఖ అధ్వర్యంలో కలెక్టర్ యువరాజ్, ఐటిడిఎ పిఒ. హరినారాయణన్, సబ్ కలెక్టర్ శివ శంకర్ ఇంకుడు గోతులు తవ్వారు. ఈ కార్యక్రమంలో టి.డబ్ల్యు. ఇఇ కుమార్, వెలుగు ఎ.పి.డి. రత్నాకర్, టి.డబ్ల్యు. డి.డి. కమల, ఉపాధి హామీ పథకం ఎ.పి.డి. లచ్చన్న, హౌసింగ్ డి.ఇ. ఉమామహేశ్వరరావు, ఎం.పి.డి.ఒ. మల్లికార్జునరావు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ శెట్టి కృష్ణారావు, సర్పంచ్ సమర్డి గులాబి పాల్గొన్నారు.గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. దత్తత గ్రామాల గిరిజనులు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, విద్యాభ్యాసన, మరుగుదొడ్ల నిర్మాణం, ఆసుపత్రిలో ప్రసవాలు, ఇంకుడు గుంతల తవ్వకాలకు అధిక ప్రాధాన్యతఇవ్వాలన్నారు. పెదలబుడులో ఇంటింటికీ కుళాయిలద్వారా తాగునీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు 25 లక్షలతో పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో 33 బోరింగులు ఏర్పాటుచేశామన్నారు. భవిష్యత్‌లో గిరిజనుల నుంచి పంచాయతీ నీటి పన్నులు వసూలు చేయాలన్నారు. ఉపాధి పనుల్లో జాప్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ యువరాజ్ ఎ.పి.డి. భ్రమరాంబ, ఎ.పి.ఒ. చిన్నారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పనుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసి భవిష్యత్‌లో పద్ధతి మార్చుకోకపోతే ఇంటికి పంపించి వేస్తామని హెచ్చరించారు. అనంతరం పెదలబుడు సమీప కొండవద్ద అటవీ శాఖ అధ్వర్యంలో కలెక్టర్ యువరాజ్, ఐటిడిఎ పిఒ. హరినారాయణన్, సబ్ కలెక్టర్ శివ శంకర్ ఇంకుడు గోతులు తవ్వారు. ఈ కార్యక్రమంలో టి.డబ్ల్యు. ఇఇ కుమార్, వెలుగు ఎ.పి.డి. రత్నాకర్, టి.డబ్ల్యు. డి.డి. కమల, ఉపాధి హామీ పథకం ఎ.పి.డి. లచ్చన్న, హౌసింగ్ డి.ఇ. ఉమామహేశ్వరరావు, ఎం.పి.డి.ఒ. మల్లికార్జునరావు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ శెట్టి కృష్ణారావు, సర్పంచ్ సమర్డి గులాబి పాల్గొన్నారు.