విశాఖ

బాబు ప్రభుత్వం నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం : పక్క తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లయినా లేదని వైకాపా విమర్శించింది. మంగళవారం వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి తెలంగాణా ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు, రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మంగళవారం రిలే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం స్పందించకపోవడాన్ని వారు విమర్శించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తాగు, సాగునీటిలో అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. కేవలం ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు ఈ వ్యవహారంపై కల్పించుకోవడం లేదని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్రునాయుడు (మిలట్రీ నాయుడు), ఏడువాక సత్యారావు, వెంపలి ఆనందీశ్వరరావు, అప్పికొండ సోమేశ్వరరావు, మొల్లి సోమునాయుడు, బొడ్డేడ సూర్యనారాయణ, వేచలపు ప్రకాష్, ఓరుగంటి నెహ్రూ, ఎం. శ్రీకాంత్, శానాపతి సత్యారావు, సూరిశెట్టి నాగగోవింద పాల్గొన్నారు.
మాడుగులలో..
మాడుగుల : వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న జలదీక్షకు మద్దతుగా మంగళవారం మాడుగులలో వైకాపా మండలాధ్యక్షుడు తాళ్లపురెడ్డి రాజారావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో సర్పంచ్‌లు, ఎం.పి.టి.సిలు కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని శాసనసభ్యుడు బూడి ముత్యాలనాయుడు సందర్శించారు. అంతకుముందు వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణ, గోదావరి జలాలపై తెలంగాణా ప్రభుత్వం అడ్డగోలు ప్రాజెక్టుల నిర్మాణంవల్ల ఎ.పి.కి అన్ని విధాలా నష్టం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజనాధ్యక్షుడు కొట్యాడ భాస్కరరావు, మండల కార్యదర్శి వేమవరపు రామ ధర్మజ పాల్గొన్నారు.
హుకుంపేటలో..
హుకుంపేట : వై.ఎస్.జగన్ చేపట్టిన జలదీక్షలకు మద్దతుగా స్థానిక వైకాపా నాయకులు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ముందుగా జలదీక్షకు మద్దతుగా నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక చీడిపుట్టు గెడ్డలో దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండలాధ్యక్షుడు జి.కొండబాబు, మాజీ ఎం.పి.టి.సి. చిన్నబ్బి పాల్గొన్నారు.