విశాఖ

భూ సమస్యలు పరిష్కరించాలని అర్డీవో కార్యాలయం వద్ద ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, నవంబర్ 14: వ్యవసాయ సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరుచేసి సమస్య పరిష్కరించాలని కోటపాడు మండలం చౌడువాడ, పాచిలివానిపాలెం గ్రామాలకు చెందిన రైతులు బుధవారం అర్డీవో కార్యాలయం ఏదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన మోహన్ మాట్లాడుతూ చౌడువాడ, పాచిలివానిపాలెం గ్రామాలకు చెందిన సుమారు రెండువందల కుటుంబాల రైతులు 270 ఎకరాల్లో గత కొనే్నళ్ళుగా వ్యవసాయం సాగుచేసుకొని జీవనోపాధి పొందుతున్నారన్నారు. సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరుచేయాలని ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు చేసి వినతిపత్రాలు అందజేసామన్నారు. గతనెల 29న కోటపాటులో తహాసీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించామన్నారు. తరువాత జరిగిన గ్రామ సభలో భూ సమస్యలు పరిష్కరించి పట్టాలు మంజూరుచేయాలని ధరఖాస్తు చేసామన్నారు. ఆ సమయంలో అధికారులు స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. నెల రోజులు గడిచిపోయినా సమస్యపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని అవేధన వ్యక్తం చేసారు.తక్షణమే ఆ భూములకు సాగు హాక్కు కల్పించి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఎవోసత్యనారాయణకు వినతిపత్రం అందజేసారు. ఈ ధర్నాలోరైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రంధాలయాలను యువత సద్వినియోగం చేసుకోవాలి

అనకాపల్లి టౌన్, నవంబర్ 14: గ్రంధాలయాలను యువత సద్వినియోగం చేసుకొని తమ బంగారు భవిష్యత్‌ను పూల బాటగా మలుచుకోవాలని స్థానిక సబ్ జైలర్ ఒమ్మి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక శాఖవీధి శాఖాగ్రంధాలయంలో 51వ వారోత్సవాలను బుధవారం ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ గ్రంధాలయానికి వచ్చి పుస్తక పఠనం ఒక అలవాటుగా మలుచుకోవాలన్నారు. ప్రంపంచంలో ఎన్నో మనకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్న పుస్తకాల్లోదాగి ఉంటాయన్నారు. ప్రతీ రోజు ఒక గంట పస్తక పఠనం చేసి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.గతంలో గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకొని ప్రంపంచంలో తెలియని విషయాలు పుస్తకాలు ద్వారా తెలుసుకొని నేడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారన్నారు. జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు రోజున చాచానెహ్రూ జయంతి రావడం ఎంతో గర్వించదగిన విషయమన్నారు.ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు ఆర్పించారు.పోగ్రాం కన్వీనర్ బల్లా నాగభూషణం అధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధానోపాధ్యాయులు ఆళ్ళ ఓంరాం, ఉపాధ్యాయునిలు శ్రీవాణి, ఎన్ శైలజ, గ్రంధాలయం శాఖాధికారిని చాయాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన అగ్రిగోల్డ్ బాధితులు

అనకాపల్లి టౌన్, నవంబర్ 14: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఇంటిని బుధవారం ర్యాలీగా తరలివెళ్ళి ముట్టడించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు వైఎన్ భద్రం మాట్లాడుతూ రాష్ట్రంలో 19.52లక్షల మంది నుండి మూడువేల 965 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అగ్రిగోల్డ్ యాజమాన్యం నుండి బాధితులకు డబ్బు తిరిగి ఇప్పించడానికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో వేలాది మంది బాధితులు ఉన్నారని ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. బాధితులునుండి వివరాలు సేకరించి ఏళ్ళు గడుస్తున్న బాధితులకు చెల్లించండంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేస్తుందన్నారు.ప్రభుత్వం తక్షణమే వెయ్యికోట్లు అడ్వాన్స్‌గా కోర్టుకు జమచేసి ఆ మేరకు విలువైన అటాచ్డ్ ఆస్తులను తీసుకొని కోర్టు అనుమతితో జిల్లా కమిటీల ద్వారా బహిరంగవేలంపాటి నిర్వహించాలని డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా వినతిపత్రాన్ని ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేసారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.

ఘనంగా పరమటమ్మఅమ్మవారి ఊరేగింపు

కశింకోట, నవంబర్ 14: జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన శ్రీపరమటమ్మ అమ్మవారి మహోత్సవం ఈనెల 29న అత్యంత వైభవంగా జరగనుంది. దీంతో అమ్మవారి భక్తులు పరమటమ్మ అమ్మవారిని కశింకోట పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేసారు. ముందుగా ఈ ఊరేగింపును నియోజకవర్గ జనసేన కన్వీనర్ కొణతాల సీతారాం అట్టహాసంగా ప్రారంభించారు. దీంతో భక్తులు భక్తిపాటలతో ఊరేగింపును కొనసాగించారు. భారీస్థాయిలో బాణాసంచా వెలిగించి వారుకున్న భక్తిని చాటుకున్నారు. జనసేన నాయకులు ఊరేగింపు ఆధ్యాంతం మొత్తం పాల్గొన్నారు. చిడతలు, తప్పెడగుళ్లు, పులివేషాలు, భజన పాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం సీతారాం చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ గ్రామీణప్రాంతాల్లో ఇటువంటి పండగలు చేసుకోవడంతో ప్రతిఒక్కరిలో ఆనందం ఉంటుందన్నారు. కుటుంబాలు కలిసిమెలిసి పండగలు చేసుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. పరటమ్మ అమ్మవారిని కొలిచే భక్తులు వారి కోరికలు నెరవేరుతాయని పూర్వికులు చెపుతుంటారన్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో అమ్మవారి భక్తులతో పాటు జనసేన నాయకులు కాండ్రేగుల సునీల్, గల్లా వినోద్, దాడి బుజ్జి, నిమ్మదల సురేష్, హరీష్, మారిశెట్టి శ్రీను, దాడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం

కశింకోట, నవంబర్ 14: మండల కేంద్రమైన కశింకోటతోపాటు తాళ్లపాలెం గ్రంధాలయంలో కూడా గ్రంధాలయ వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక గ్రంధాలయంలో ఎంపిపి పంచదార్ల లక్ష్మీ నెహ్రూచిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అలాగే తాళ్లపాలెంలో కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక గ్రంధాలయాధికారి ఎల్.వి రమణ, తాళ్లపాలెం గ్రంధాలయాధికారి కాండ్రేగుల జగన్నాధం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టగా ఎంపిపి లక్ష్మీ మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈ వారోత్సవాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు. అలాగే నెహ్రూ జయంతి వేడుకలు తాళ్లపాలెం జిల్లాపరిషత్ హైస్కూల్‌లో హెచ్‌ఎం బీమిశెట్టి అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో బివి సత్యనారాయణ, శిష్టి అప్పారావు, దొడ్డి ఈశ్వరరావు, బీశెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.