విశాఖ

భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, జనవరి 19: భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ వై.శ్రీనివాసరావు అన్నారు. శనివారం రెవెన్యూ కార్యాలయంలో వీ ఆర్ ఓలు, ఇతర సిబ్బందితో ఆయన పెండింగ్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో రెవెన్యూ గ్రామాల వారీగా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 1100 కలెక్టర్, గ్రీవెన్స్ , మీసేవా కేంద్రాల్లో ఉన్న దరఖాస్తులు పరిష్కారంపై చర్చించారు. 1100 , మీ కోసంలో ఫిర్యాదులు చేసిన వారిని రప్పించి వారి నుంచి కూడా వివరాలు సేకరించారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న ఈ ఫిర్యాదులను మీ సేవా దరఖాస్తులను పరిష్కరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈవిషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

సీలేరులో అంతర్‌రాష్ట్ర కబాడీ పోటీలు
సీలేరు,జనవరి 19: అంతర్‌రాష్ట్ర కబాడీ పోటీలు సీలేరులో అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈపోటీలు జెన్‌కో డివిజన్ ఇంజనీర్ మల్లేశ్వర ప్రసాద్ ప్రారంభించారు. 19 నుంచి 21 వరకు మూడు రోజులు పాటు నిర్వహించే శ్యామ్యూల్‌రాజ్ స్మారక అంతర్ రాష్ట్ర పురుషుల కబాడీ పోటీలు స్థానిక యంగ్ స్టార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ఆంధ్రా - ఒడిషా రెండు రాష్ట్రాల నుంచి 24 జట్లు పాల్గొంటున్నాయి. యంగ్‌స్టార్,తూర్పుగోదావరి జిల్లా బత్తులూరు గ్రామానికి చెందిన క్రీడాకారులు మొదటి రోజు ఆటలో తలపడ్డారు. క్రీడాకారులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కమిటీ చేపట్టింది. ఈకార్యక్రమంలో ఎస్సై విభూషణరావు, మాజీ ఎంపీటీసీ పి. సాంభమూర్తి, సర్పంచ్ కె.పరదేశి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ప్రసాద్ నియామకంపై హర్షం
సీలేరు, జనవరి 19: రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడిగా ఎంవీ ఎస్‌వీ ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై దారాలమ్మ ఆలయ కమిటీ చైర్మెన్ మాడుగుల పాపారావు హర్షం వ్యక్తం చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే ప్రసాద్ ఈపదవికి వనె్న తెస్తారన్నారు. కష్టపడి పని చేసే వారికి పార్టీ గుర్తింపునిస్తుందని ప్రసాద్‌కు పదవి రావడం రుజువు చేసిందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పని చేయాలన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
రావికమతం, జనవరి 19: చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ఆదివారం చోడవరంలో ప్రారంభిస్తున్నామని ఈపార్టీ క్రియాశీలక కార్యకర్త పీ ఎస్ ఎన్ రాజు తెలిపారు. ఈకార్యక్రమానికి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పార్టీ జిల్లా కార్యవర్గం హాజరవుతున్నందన నాలుగు మండలాల నుంచి జనసేన కార్యకర్తలు అత్యధికంగా తరలి రావాలని కోరారు.

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు
రావికమతం, జనవరి 19: మండల కేంద్రం గెంజి వారి కోదండరామ ఆలయ తీర్థ మహోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన వివిధ రకాల పోటీలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ఆవరణలో ముగ్గుల పోటీలు, లెమన్ స్ఫూన్, బైక్ రేస్ తదితర పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేసారు. వీటిని తిలకించేందుకు గ్రామస్తులతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం రామాలయ ఉత్సవ విగ్రహాలను గ్రామంలో తప్పెటగుళ్ళు తదితర సాంస్కృతి కార్యక్రమాల నడుము ఊరేగించారు.
ఘనంగా గ్రామాల్లో తీర్ధ మహోత్సవాలు
గొలుగొండ, జనవరి 19: సంక్రాంతి పండుగ మహోత్సవాలను పురష్కరించుకుని మండలంలో పలు గ్రామాల్లో తీర్దమహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. పాలకపాడు పంచాయతీ శివారు వెంకటరామపురం , జమ్మాదేవిపేట గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో శనివారం తీర్థమహోత్సవాలను నిర్వహించారు. గ్రామాల్లోని హిందూసాంప్రదాయ ప్రకారం భజన కార్యక్రమాలను , రంగవల్లుల పోటీలతో పాటు ఆటల పోటీలను ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌ల ఆద్వర్యంలో నిర్వహించారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యగా స్థానిక ఎస్సై ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసారు. ఆటల పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రధానం చేసారు.