విశాఖ

జిల్లాకు, పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి పేరు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, జనవరి 19: విశాఖ జిల్లాతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. అండమాన్ దీవులు టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ మాధవులనాయుడు, అల్లూరి యువజన సంఘం జాతీయ నాయకులు సుబ్రమణ్యం, శ్రీకాంత్, వైసీపీ విశాఖ పార్లమెంట్ సంయుక్త కార్యదర్శి జ్యోతి తదితరులతో కలిసి ఆయన రాజేంద్రపాలెం , మంప గ్రామాల్లో అల్లూరి స్మారక ప్రదేశాలను సందర్శించారు. అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లూరి నడయాడిన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు పలు మార్లు విన్నవించినా ఫలితం లేక పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అండమాన్ దీవుల్లో అల్లూరి, పొట్టి శ్రీరాముల విగ్రహాలు ఉన్నాయని మాధవుల నాయుడు తెలిపారు. అల్లూరికి సరైన గుర్తింపునివ్వడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.
జనావాసాల చెంతన నాగుపాము హల్‌చల్
కొయ్యూరు,జనవరి 19: రత్నంపేట గ్రామ సమీపంలో శనివారం నాగుపాము, పొడపాములు హల్‌చల్ చేసాయి. సంక్రాంతి సందర్భంగా రత్నంపేటలో జరిగే తీర్థాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు చేరుకున్నారు. తీర్థం జరిగే ప్రాంతానికి చేరువలో ఒక పొడ పామును నాగు పాము మింగడం చూసి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పాములు సాధారణం కప్పలు, ఎలుకలు, చిన్న కోడి పిల్లలు వంటివి మింగుతుంటాయి. అలాంటికి నాగుపాము పరిమాణంలో ఉన్న పెద్ద పొడపామును నాగుపాము సగం వరకు మింగడం ఆశ్చర్యంతో పాటు భయానికి గురి చేసింది. దీంతో స్థానికులు వాటిని హతమార్చారు. వీటిని చూసేందుకు జనం ఎగబడ్డారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ దే అధికారం
* నియోజకవర్గం సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం, జనవరి 19: రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం , జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమని ఆపార్టీ నియోజకవర్గం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. పట్టణంలోని శారదానగర్ వీధిలో శనివారం జగన్ పిలుపునిచ్చిన నిన్ను నమ్మం బాబూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాన్ని ప్రచారం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతున్నారన్నారు. తాను అధికారంలోకి వస్తే వృద్దాప్య ఫించన్‌ను రెండువేలకు పెంచుతానని జగన్ గతంలోనే ప్రకటించగా , ప్రస్తుతం చంద్రబాబు కాపీ కొట్టి రెండువేల రూపాయలకు పెంచారన్నారు. గత ఎన్నికల అనంతరం రెండు వందల రూపాయల ఫించన్‌ను వెయ్యి రూపాయలకు పెంచి అర్హులైన అనేక మంది పేర్లు అడ్డుగోలుగా తొలగించారన్నారు. రాన్నున ఎన్నికల్లో మళ్ళీ టీడీపీని గెలిపిస్తే ప్రస్తుతం ఫించన్లు పొందుతున్న వారిని తొలగించడం ఖాయమన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేయడం టీడీపీ నాయకుల నైజమని విమర్శించారు. ఈకార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తమరాన అప్పలనాయుడు,నాతవరం , మాకవరపాలెం, నర్సీపట్నం మండలాల పార్టీ అధ్యక్షులు శెట్టి నూకరాజు, రుత్తల సత్యనారాయణ, సుర్ల సత్యనారాయణ, బోళెం చిరంజీవి, ఏకా రాజుబాబు, గొలుసు నర్సింహమూర్తి, గుడివాడ లచ్చబాబు, గుడిబండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

* మంత్రి అయ్యన్న విలువలు గురించి మాట్లాడడం విడ్డూరం
రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ విలువలు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఉమాశంకర్ గణేష్ ఎద్దేవా చేసారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందని, అటువంటి కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే తాను వ్యతిరేకిస్తానని ప్రకటించిన అయ్యన్నపాత్రుడు నేడు రాజకీయ విలువలు గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి విలువల్లేని రాజకీయాలు చేస్తున్నది అయ్యన్నపాత్రుడేనన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి అన్యాయం జరుగకుండా తెలుగువారంతా ఒకే తాటిపై ఉండాలనే ఉద్దేశ్యంతోనే టీ ఆర్ ఎస్ నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని కలిసారన్నారు. సోనియాగాంధీ ఇటలీ దెయ్యమని, రాజీవ్ గాంధీ అనకొండని విమర్శించిన చంద్రబాబు తెలంగాణాలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని విలువలకు తిలోదకాలు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఈసమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.