విశాఖ

అభివృద్థిలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్-1 గాచేసిన ఘనత చంద్రబాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, జనవరి 23 : ఆంధ్రప్రదేశ్‌లో విభజనకు గురైనప్పటికీ అభివృద్థిలో నెంబర్- 1 గాతయారుచేసిన ఘనత ముఖ్య మంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ముత్తం శెట్టిశ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితోకలిసి విస్తృతంగా పర్యటించిన ఆయన పలుగ్రామాల్లో అభివృద్థిపనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా పెదయాతపాలెంలో సామాజిక భవనానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంత కుముందు ఎల్లుప్పి, మర్రిపాలెం, బోదువలస, అమృతపురం, చిన వంగలి, బాటజంగాలపాలెం, ఆదిరెడ్డిపాలెం, నల్లరేగులపాలెం, నారపాడుల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆరిపాకలో జరిని సమావేశంలో పార్లమెంటు సభ్యులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేసినప్పటికీ రాష్ట్రంలో అభివృద్థి పనులు, సంక్షేమ పథకాలకు ఆటంకం లేకుండా సీఎం బాబు కొనసాగించటం అభినందనీయమన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులంతా నిరసనలు,ఆందోళనలు చేసినప్పటికీ ప్రధాని మోడీ మొండి చేయి చూపించటం అన్యాయమన్నారు. అయినప్పటికీ ఎలాంటి జంకు లేకుండా సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధానిని అమరావతిలో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా నిర్మించటంతోపాటు వచ్చేనెలలో హైకోర్టు భవనాలను సైతం ప్రారంభించుకునేందుకు వీలుకల్పించేలా పనులు శర వేగంగా పూర్తిచేశారన్నారు. పింఛన్ల విషయంలో ఫిబ్రవరి నెల నుంచి 2వేల రూపాయలకు పెంచటం నిరుపేదల జీవితాల్లో వెలుగునింపటమేనన్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రడ్డారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితోపాటు ఎంపీడీవో బి.రమేష్‌నాయుడు, టీడీపీ నేతలు గండి దేముడు, శరగడం శంకరరావు, గవర శ్రీనివాసరావు, కొటాన అప్పారావు,జడ్పీటీసీ గేదెల సత్యనారాయణ, మండల ఇంజినీరింగ్ అధికారి జి.చిట్టిబాబు, కొట్యాడ రాంబాబు, శరగడం సాయి అన్నపూర్ణలు పాల్గొన్నారు.
మొగలిపురంలో మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం
సబ్బవరం, జనవరి 23 : మండలంలోని మొగలిపురంలో బుధవారం శ్రీ సీతారాముల స్వామి వారి తీర్థమహోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి మహిళల కబడ్డీపోటీలు ప్రారంభమయ్యాయి. పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన ఈపోటీలను స్థానిక ఎంపీపీ గొర్లి ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ గండి రవికుమార్‌లు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీపీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ క్రీడల్లో చెప్పుకోదగిన ఆట కబడ్డీ అన్నారు. ఈ క్రీడలో పురుషులతోపాటు స్ర్తిలు కూడా జాతీయ, అంతర్జాతీయ లో రాణించి మన దేశానికి పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారన్నారు. ఇక్కడ పోటీలకు హాజరయిన విశాఖ, లంకెలపాలెం, గాజువాక, అచ్యుతాపురం ల జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. గండి రవికుమార్ మాట్లాడుతూ ఈపోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 10వేల రూపాయలు, రెండవ బహుమతి -8 వేలు, మూడవ బహుమతి- 5వేలు, నాల్గవ బహుమతిగా 4వేల రూపాయల చొప్పున నగదు బహుమతులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈకార్యక్రమంలో సబ్బవరం మాజీ సర్పంచు ధనిమిరెడ్డి శ్రీనివాసరావు,స్థానిక ఎంపీటీసీ బైలపూడి సత్యం, ఇండిగబిల్లి దేముడు, ఎమ్మెల్యే దేముడు, సబ్బవరపు కుమార్, అంగటి సూర్యనారాయణలు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ..ఉల్లాసంగా మహిళా కబడ్డీ పోటీలు
* జాతీయ మహిళల కబడ్డీ క్రీడాకారిణి కాశీలక్ష్మిప్రత్యేక ఆకర్షణ *
సబ్బవరం, జనవరి 23 : మండలంలోని మొగలిపురంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతున్నాయి. సాధారణంగా పురుషుల కబడ్డీపోటీలు మాత్రమే చూస్తూవస్తున్న గ్రామీణ ప్రజానీకానికి మహిళల కబడ్డీపోటీలు ప్రత్యేక ఆకర్షణగానిలిచాయంటే అతిశయోక్తికాదు. ఈపోటీల్లో జాతీయ మహిళల కబడ్డీ విజేత, కేలోఇండియాక్రీడాకారిణి కాశీలక్ష్మీ ఆటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.