విశాఖ

వాహనం నడిపే ప్రతీ ఒక్కరూ విధిగా లైసెన్స్ పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జనవరి 23: ప్రమాదాల బారిన పడిన వారి కుటుంబాల వారికి ఆర్ధిక రక్షణ కోసం ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎల్ ఎల్ ఆర్ డ్రైవింగ్ మేళాను నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి మహిళలనుద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదానికి గురైన వాహనదారునికి డ్రైవింగ్ లైసెన్స్ లేక పోతే ఇన్సూరెన్స్, ఇతర ఆర్ధిక సహాయాలు అందే అవకాశం ఉండక అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్‌ను అందించడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల మేళాను నిర్వహించాలని నిర్ణయించారన్నారు. ఎల్ ఎల్ ఆర్ మేళాలు నిర్వహించడంలోనూ, అధిక శాతం మందికి ఎల్ ఎల్ ఆర్ లైసెన్స్‌లు ఇవ్వడంలోనూ విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నర్సీపట్నంలో మహిళల కోసం ఫ్రత్యేకంగా లైసెన్స్ మేళాను ఏర్పాటు చేసామన్నారు. ఈ మేళాకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలి రావడం అభినందనీయమన్నారు. 400 మంది వరకు మహిళలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. గతంలో నిర్వహించిన మేళాలో ఒక్క నర్సీపట్నంలోనే 5,297 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకుని లెర్నింగ్ లైసెన్స్‌లు పొందారన్నారు. డ్రైవింగ్ టెస్ట్‌కు అనకాపల్లి వెళ్ళి రావడం వ్యయప్రయాసాలతో కూడుకోవడం వలన నర్సీపట్నంలోనే ఈ టెస్ట్ నిర్వహించాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. ఆటో డ్రైవర్లు ట్యాక్స్ కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ప్రభుత్వం పన్నును రద్దు చేయడం జరిగిందన్నారు. వాహనం నడిపే సమయంలో నిర్లక్ష్యం , ఉదాసీనత ఉండకూదని, ఓవర్ లోడింగ్ చేయకూడదన్నారు. వేగంగా వాహనం నడిపే సమయంలో మనమీద ఆధారపడి కుటుంబం ఉంటుందని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. రవాణా శాఖ ఉప కమీషనర్ ఆర్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముంగిట్లో రవాణా శాఖ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు. మంత్రి సూచన మేరకు నర్సీపట్నంలో డ్రైవింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 90 వేల మందికి ఎల్ ఎల్ ఆర్‌లు ఇచ్చామన్నారు. ఎల్ ఎల్ ఆర్ పొందిన ఆరు నెలలు దాటిన తరువాత తిరిగి రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. మితిమీరిన వేగం, హెల్మెట్లు ధరించకపోవడం కారణంగానే 70 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు నివారించాలి, మరణాలు సంఖ్య తగ్గించాలి అనే నినాదంతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మంత్రి అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా మహిళలకు ఎల్ ఎల్ ఆర్ ధృవపత్రాలను అందజేసారు. ఈకార్యక్రమంలో ఎంపీపీలు సుకల రమణమ్మ, సన్యాసిదేవుడు, రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారి ఖాన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రావు, కళాశాలల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదినారాయణ, మోటార్ వాహనాల ఇన్స్‌పెక్టర్ సంజీవరావు పాల్గొన్నారు.