విశాఖ

గిరిజన విద్యార్ధి మరణం పై విచారణ చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదబయలు. ఫిబ్రవరి 14: ప్రభుత్వ గిరిజన సం క్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధులు వివిధ కారణాలతో మరణాలు సంబవిస్తున్న అధికారులు చర్యలు ఎందుకు చేపట్టడం లేదో సమాదానం చెప్పాలని వైసీపీ విద్యార్ధి విభాగం మండల నాయకుడు చెండా రవిశంకర్ ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలలో తరుచు వివిధ కారణాలతో మరణావు సంబవిస్తున్న అధికారులు విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల మరణాలు అధికం అవుతుందని ఆయన అన్నారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ పాఠశాలలో విద్యార్ధి అకస్మిక మరణంపై ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గిరిజన విద్యార్ధుల మరణాలపై ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపంచడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైదాన ప్రాంతాలలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులు అంతు చిక్కని కారణాలతో మృతి చెందితే అధికారుల హడావిడి, ప్రత్యేక ధర్యాప్తులు జరుపుతున్నారు కాని గిరిజన విద్యార్ధులు మరణిస్తే కనీసం విచారణ ఎందుకు చెపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గిరిజన విద్యార్ధుల మరణాలపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్ధి కుటుంబానికి పది లక్షలు ఎక్స్‌గ్రెషియా చెల్లించి ఆదుకోవాలని అన్నారు. ప్రతీ పాఠశాలలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు అధ్యాయనం చేసి వారి సమస్యలను పరిష్కరించి మరణాలను పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

నాటుసారా అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు
కోటవురట్ల, ఫిబ్రవరి 14: గ్రామాల్లో నాటుసారా తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని కొయ్యూరు ఎస్సై రెడ్డి అసిరితాత హెచ్చరించారు. రాజేంద్రపాలెం పంచాయతీ కొత్తవీధి సమీపంలో నిల్వ ఉంచిన సుమారు 200 లీటర్ల బెల్లం పలుపును కొయ్యూరు పోలీసులు ధ్వంసం చేసారు. అనంతరం పలు గ్రామాల ప్రజలతో ఎస్సై మాట్లాడుతూ నాటుసారా తాగడం వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు . ఆరోగ్యాలు చెడిపోయి అతి తక్కువ కాలంలోనే మరణాలు సంభవిస్తున్నాయన్నారు. నాటుసారా తయారు చేయడం, అమ్మడం చట్టరీత్యా నేరమన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంఘ విద్రోహ శక్తులకు దూరంగా ఉండాలన్నారు. యువత చెడు మార్గాన్ని వీడి మంచి మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు.

జీసీసీ చైర్మెన్‌గా ఎంవీవీ ప్రసాద్ నియామకం
కొయ్యూరు, ఫిబ్రవరి 14: గిరిజన సహకార సంస్థ చైర్మెన్‌గా టీడీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రసాద్‌కు చైర్మెన్ పదవి విరించడం పట్ల కుటుంబ సభ్యులు, స్ధానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న ప్రసాద్‌ను గత నెల 17న పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షునిగా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఎన్నికల సమీపిస్తున్న సమయంలో జీసీసీ చైర్మెన్‌గా నామినేటెడ్ పదవిలో నియమించడం పార్టీ వర్గాలకు హర్షదాయకంగా మారింది. దీంతో గురువారం స్వగ్రామం కొయ్యూరులో పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఎంపీపీ సత్యనారాయణ, జెడ్పీటీసీ శ్రీరామ్మూర్తి, ఎ ఎంసీ చైర్మెన్ చిట్టిబాబు, పార్టీ మండలాధ్యక్షుడు రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి వరహాలబాబు, ఎంపీటీసీలు శివరామరాజు, సరస్వతీలతో పాటు నేతలు శ్రీరాములు, నాగేశ్వరరావు , ఖాన్ తదితరులు ప్రసాద్‌ను కలిసి అభినందనలు తెలిపారు . ఈసందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకంతో ఈపదవిని కట్టబెట్టడం మరింత బాధ్యతను పెంచిందన్నారు. శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతంతో పాటు జీసీసీ, గిరిజనుల అబివృద్ధికి కృషి చేస్తానని ప్రసాద్ తెలిపారు.

మేలు చేసే పార్టీకి పట్టం కట్టాలి
* మంత్రి అయ్యన్నపాత్రుడు
కోటవురట్ల, ఫిబ్రవరి 14: ఏ పార్టీ మేలు చేస్తోందో ప్రజలు ఆలోచించి ఆపార్టీకే పట్టం కట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. పని చేసే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. మండలంలో సుంకపూర్‌లో గురువారం మంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే అనితలు ఎన్టీ ఆర్ విగ్రహాలను ఆవిష్కరించి పలు అబివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు. రాష్ట్రంలో 73 లక్షల రైతు కుటుంబాలకు 10 వేల రూపాయలు వంతున ప్రతీ ఏటా అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్ధిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే 55 లక్షల మందికి ఫించన్లును అందజేస్తున్న ఘనత దేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. టీడీపీ హయాంలో 20 లక్షల పక్కా ఇళ్ళను నిర్మించడం జరిగిందన్నారు. అలాగే మూడు లక్షల మంది ఒంటరి మహిళలకు ఫించన్లు ఇస్తున్నామన్నారు. ఎన్టీ ఆర్ సుజల స్రవంతి కింద 2,400 కోట్లతో లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని అబివృద్ధికిలో రావాలన్నారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ ఇరిగేషన్ కింద మండలంలో కోటి రూపాయలు పనులు చేయించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధికి అయ్యన్నపాత్రుడు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసారన్నారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.