విశాఖ

కాంగ్రెస్‌తోనే యువతకు ఉపాధి పుష్కలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 18: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్దితోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని కాంగ్రెస్‌పార్టీ నాయుకులు పరుచూరి భాస్కరరావు అన్నారు.ఇంటింటి కాంగ్రెస్‌లో భాగంగామండలంలోని గోపాలపురం, గొలగాం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి అక్కడి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.ప్రత్యేక హోదా వస్తే యువతకు అన్ని విధాలుగా ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.ప్రత్యేక హోదాసాధనకై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి యువత ఆభినందలు తెలియజేస్తూ పార్టీలోచేరుతున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మళ్ళీ ఇందిరమ్మ పాలనతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అందజేయడానికి సిద్దంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో పరుచూరి ఇంటంటికి వెళ్ళి కరపత్రాలు అందజేసారు. మహిళలు ఆయనకు హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలోఎం శ్రీనివాసరావు, రొంగలి శ్రీరామూర్తి, పి కామరాజు, గంజి సత్యారావు, పూడి పరిదేశినాయుడు, ఒమ్మి రామూయాదవ్, బోయిన భానుమూర్తియాదవ్ తదితరులు పాల్గొన్నారు.

విలువలతో కూడిన రాజకీయాలు కొడుగంటికే సొంతం
అనకాపల్లిటౌన్, ఫిబ్రవరి 18: నైతిక విలువలతోకూడిన రాజకీయాలు చేయడం స్వాతంత్ర సమర యోదుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొడుగంటి గోవిందరావుకే సొంతమని పలువురు వక్తలు కొనియాడారు. గొవిందరావు 5వ వర్ధంతి సందర్బంగా సోమవారం స్థానిక నెహ్రూచౌక్ కూడలిలో ఉన్న గోవిందరావు విగ్రహానికి సిపిఐ పార్టీ నాయుకులు అధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన గాయిత్రి విద్యాసంస్థ అధినేత కెవి గౌరీపతి మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో నాలుగు సార్లుఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ రైతులకు, కార్మికులకు, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోరకు నిరంతరం పోరాడిన నాయుకుడన్నారు. సీపీఐ జిల్లాకమిటీ సభ్యులు వైఎన్ బద్రం మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయుకులు నైతిక విలువలును తుంగలో తొక్కి పదవుల కోసం పూటకోక పార్టీలు మారుతూ వూసరవెల్లిలను తలపించే రీతిలోవ్యవహరిస్తూ రాజకీయ విలువలను కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. పదవులు ప్రాధాన్యం ఇచ్చినట్లు నైతిక విలువలకు ప్రాధ్యానం ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలోసీపిఐ నాయుకులు శ్రీరామదాసు అబ్బులు, కె సూర్యనారాయణ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ, తాకాశి వెంకటేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.