విశాఖ

అనారోగ్యాన్ని జయించి... అనుకున్నది సాధించి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 17: కూలికి వెళితేగాని పూట గడవని పేదరికంలోనూ నర్సింగ్ కోర్సు చదవాలని తపన పడిన గిరిజన యువతికి అనారోగ్యం అడ్డంకిగా మారితే మానవత్వం తో స్పందించిన పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి బాసటగా నిలిచారు. దీంతో తన ఆశయాన్ని యువతి నెరవేర్చుకోగలిగింది. పెదబయలు మండలం పర్రెడ గ్రామానికి చెందిన పాంగి జమీన్ అనే గిరిజన యువతికి తండ్రి లేకపోవడంతో తల్లి కూలీ పనిచేసుకుని అష్టకష్టాలు పడి పోషిస్తోంది. అయితే తన కుమార్తె నర్సింగ్ కోర్సును అభ్యసించాలని తపన పడడంతో ఎంత కష్టపడైనా చదివించాలని నిర్ణయించుకుని విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ కాలేజి ఆఫ్ నర్సింగ్ కళాశాలలో చేర్పించింది. ఈ కళాశాలలో బి.ఎస్.సి. నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పద్మావతికి మార్చి నెలలో తీవ్రమైన కుడికాలు నొప్పి వచ్చి నడవలేని స్థితికి చేరింది. తన కాలు ఎముకలకు క్షయ సోకిందని ఆందోళన పడిన ఆమె విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రిలో బయోప్సి వైద్య పరీక్ష చేయించడంతో క్షయ లేనట్టు తేలింది. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఈ యువతిని ఇద్దరు వ్యక్తులు సాయంతోనే ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చేది. తనకు ఎదురైన ఈ పరిస్థితిని పద్మావతి పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి హరినారాయణకు మొర పెట్టుకుని తనకు వచ్చిన వ్యాధితో నర్సింగ్ చేయాలనే తన కల సాకారమయ్యేటట్టు లేదని వాపోయింది. దీంతో తక్షణమే స్పందించిన ప్రాజెక్టు అధికారి ఐదు వేల రూపాయల నగదును ఆమెకు ఇచ్చి ప్రభుత్వ అంబులెన్స్‌లో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించి ఆసుపత్రి వైద్యులకు ప్రత్యేకంగా లేఖ రాశారు. నిమ్స్ ఆసుపత్రి వైద్యులు పద్మావతికి పరీక్షలు నిర్వహించి కీళ్లవాతంగా గుర్తించడమే కాకుండా వైద్యానికి నాలుగు లక్షల రూపాయల వ్యయమవుతుందని ప్రాజెక్టు అధికారికి తెలిపారు. ఆరు విడతలుగా ఆమెకు ఇంజక్షన్లు చేయాల్సి ఉందని, ఒక్కొక్క ఇంజక్షన్ ఖరీదు 66 వేల రూపాయలు ఉంటుందని నిమ్స్ వైద్యాధికారి చెన్నక్ ప్రాజెక్టు అధికారికి వివరించారు. అయితే పద్మావతికి ఆరు విడతలుగా ఇంజక్షన్‌లు చేయాలని, ఇందుకు సంబంధించిన వ్యయాన్ని తాను చెల్లిస్తానంటూ ప్రాజెక్టు అధికారి నిమ్స్ వైద్యులకు తెలియచేయడమే కాకుండా మొదటి విడత ఇంజక్షన్ వ్యయం 66 వేల రూపాయల చెక్కును నిమ్స్ ఆసుపత్రికి పంపించారు. ఈ విధంగా ఇంతవరకు రెండు సార్లు పద్మావతికి ఇంజక్షన్‌లు చేయించడంతో ఆమెకు సోకిన వ్యాధి నయమై నడవగలిగే స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు అధికారి హరినారాయణ తనకు చేసిన మేలు ఎన్నటికీ మరువనని చెప్పింది. పేదరికంలో ఉన్న తాను నడవలేని స్థితికి చేరిన తాను వేలు ఖర్చుచేసి వైద్యం చేయించుకునే స్థితి లేదని ఆమె పేర్కొంది. ప్రాజెక్టు అధికారి తనకు వైద్యం చేయించి నర్సింగ్ చేయాలనే తన కల నెరవేర్చారని ఆమె చెప్పింది. నర్సింగ్ కోర్సును పూర్తి చేసి రోగులకు సేవలందిస్తానని పద్మావతి చెప్పింది.