విశాఖ

వారి అంతు చూస్తా... చేతకాకుంటే రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, జూన్ 17: తనకు తెలియకుండా కొంతమంది నాయకులు తప్పుడు సమాచారాలు అందించి సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దుచేయడానికి ప్రయత్నిస్తున్న వారి అంతుచూస్తానని, చేతకాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని యలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక మండల పార్టీ కార్యాలయం ఆవరణలో విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు ఆవేశంగా సమాధానం ఇచ్చారు. మండలంలో గల టి సిరసపల్లి సర్పంచ్ మద్దాల ధనలక్ష్మీపై షోకాజ్ నోటిష్ డిపిఒ ఇచ్చారని, దీనివెనుక మీ పార్టీ పెద్దలే హస్తం ఉందని ప్రజలు అనుకుంటున్నారని విలేఖర్లు అడగగా, నాకు సంబంధం లేకుండా పార్టీ నష్టం వచ్చే విధంగా, యలమంచిలి నియోజకవర్గం అభివృద్ధికి అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్న వ్యక్తులు ఎంతటి వారినైన వదిలిపెట్టే ప్రసక్తేలేదని వారు అంతుచూస్తానని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షసాధింపు చర్యలు చేసి ప్రజాప్రతినిధులను అవమానాలకు గురి చేస్తే వారికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. కేవలం ఒక్క సర్పంచ్‌నే టార్గెట్‌గా పెట్టుకొని నెలకు నాలుగు ఫిర్యాదులు చేయడం, వాటిపై అధికారులు విచారణ చేసి ఆ సర్పంచ్‌కు క్షీన్‌చీట్ ఇచ్చిన సంఘనలు నాకు తెలుసని, మంచిగా పనిచేస్తున్న సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటే నాతడకా చూపిస్తాని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎంపిపి ఆడారి మంజు, మండల పార్టీ అధ్యక్షుడు దాడి ముసిలిఅప్పారావు, టిడిపి నేతలు కె నాయుడు, కె రామనాగేశ్వరావు సుందరపు వెంకటకనకఅప్పారావు తదితరులు పాల్గొన్నారు.