విశాఖ

శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, జూన్ 17: అంగన్‌వాడీ భవనాలు శంకుస్థాపన చేయడానికి ఏర్పా టు చేసిన శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై ఏ చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుచే శంకుస్థాపన కార్యక్రమం కోసం సర్పంచ్ శిలాఫలకం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఒక వర్గం వారు గురువారం రాత్రి దానిని ధ్వంసం చేశారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారని స్థానిక ఎఎస్‌ఐ రమణను శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన పంచకర్ల నిలదీశారు. విచారణ చేస్తున్నామని చర్యలు తీసుకుంటామని ఎఎస్‌ఐ చెప్పడంతో ఎమ్మె ల్యే పంచకర్ల అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే పునరావృతమవుతాయని పంచకర్ల ఆగ్రహించారు.