విశాఖ

అందరూ క్షేమమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాతవరం, జూన్ 17: మండలంలో ఎ.పి.పురం గ్రామంలో కలుషిత చలిమిడి తిని ఆస్వస్థతకు గురైన వారు క్షేమంగా ఉన్నారని నాతవరం పి.హెచ్.సి. డాక్టర్ ఎల్.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పంచాయతీలో మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన తొండా నాగమణి అత్తవారింటికి సారెగా చలివిడి తీసుకువచ్చిందన్నారు. చలివిడిని చట్టుపక్కల వారికి పంచిన గంటలోనే 24 మందికి వాంతులు, విరోచనాలు కావడంతో స్థానిక ఎ.ఎన్.ఎం. రామలక్ష్మి తమకు సమాచారంఅందించినట్లు డాక్టర్ తెలిపారు. హుటాహుటినా సంఘటన ప్రదేశానికి వెళ్ళి 108 వాహనం సహాయంలో అస్వస్థతకు గురైన వారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. ఇదే కుటుంబానికి చెందిన నాగమణికంఠ(5),దుర్గా ప్రసాద్‌లకు ప్రత్యేక వైద్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి ఎటువంటి ప్రాణహాని లేదన్నారు. సరైన సమయంలో సమాచారం అందించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. మరో మూడు రోజులు వైద్య శిబిరాన్ని కొనసాగిస్తామన్నారు. అనంతరం డి.ఎం. అండ్.హెచ్.ఓ. సరోజని ఎ.పి. పురం గ్రామంలో వైద్యశిబిరాన్ని సందర్శించి పరిస్థితిని డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.