విశాఖ

ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరవాడ, జూన్ 17: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) రెండో యూనిట్ శుక్రవారం అధికారులు లైటప్ చేశారు. సింహాద్రి రెండవ యూనిట్‌లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు సాంకేతిక లోపంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది. దీనికారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. అయితే రెండవ యూనిట్‌కు సంబంధించిన టర్బైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ తరుణంలో సింహాద్రి అధికారులు 72 గంటల పాటు శ్రమించి టర్బైన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాని సరి చేశారు. దీంట్లో భాగంగా శుక్రవారం తెల్లవారు జామున సింహాద్రి రెండో యూనిట్‌ను అధికారులు లైటప్ చేశారు. శుక్రవారం సాయంత్రానికి రెండవ యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరుకుంది. ప్రస్తుతం సింహాద్రిలో 1,2,3,4 యూనిట్లు కలిసి 2000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.
నాలుగు గంటలపాటు 40 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
అత్యధికంగా విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసిన జంపర్ల కారణంగా ఈ సమస్య తలెత్తితుంది. అయితే శుక్రవారం పరవాడ సబ్‌స్టేషన్‌లో భారీ శబ్ధం వచ్చి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దీనికారణంగా సుమారు నాలుగు గంటల పాటు పరవాడ సబ్‌స్టేషన్ పరిధిలో గల సుమారు 40 గ్రామాల ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. వర్షం పడితే విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లితుంది. దీనికి తోడు పరవాడ సబ్‌స్టేషన్ పరిధిలోకే పారిశ్రామిక వాడలో గల పలు పరిశ్రమలకు వస్తాయి. ఆ యా పరిశ్రమలకు పరవాడ సబ్‌స్టేసన్ నుండే విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే విద్యుత్ వాడకం అధికంగా జరిగినప్పుడు జంపర్ల మరమ్మతులకు గురి కావడంతో పాటు ట్రిప్ట్ అవుతున్నాయి. ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ఆర్‌ఇసిఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా పారిశ్రామికవాడకు సంబంధించిన ప్రత్యేక ప్లీడర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఈ పనులను పరవాడ సెక్షన్ అధికారి శివ శంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది చేపట్టారు.