విశాఖ

ఎఎస్పీ ఆత్మహత్యపై రంగంలోకి సిఐడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 17: పాడేరు ఎఎస్పీ కె.శశికుమార్ ఆత్మహత్య ఘటనపై విచారణ చేసేందుకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ఎఎస్పీ శశికుమార్ గురువారం ఉదయం తన కార్యాలయంలో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని సిఐడి విచారణకు ఆదేశించారు. దీంతో విశాఖపట్నంకు చెందిన సిఐడి డిఎస్పీ వై.వి.నాయుడు సారధ్యంలో ఐదుగురు సభ్యుల బృందం గురువారం రాత్రికి పాడేరు చేరుకుని శుక్రవారం సుదీర్ఘ విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ఆ బృందం శశికుమార్ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. దాదాపు ఆరు గంటల పాటు నిర్వహించిన దర్యాప్తులో అనేక అంశాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన శశికుమార్ దినచర్య నుంచి విధి నిర్వహణలో ఆయన స్వభావం, వ్యక్తిగత అంశాలు తదితర వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది. శశికుమార్ గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడడంతో అంతకుముందు జరిగిన పరిణామాలు వంటి వాటిని కార్యాలయంలో ఉండే సిబ్బందిని విడివిడిగా అడిగి తెలుసుకోవడమే కాకుండా వారి నుంచి వాంగ్మూలాలను తీసుకున్నట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది నుంచి కూడా శశికుమార్‌పై సమాచారం సేకరించారని చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతూ రాసిన సూసైడ్ నోట్‌ను సిఐడి అధికారులు పరిశీలించి అందులో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా పోలీసు అధికారుల నుంచి సమాచారం రాబట్టినట్టు తెలిసింది. అన్ని కోణాల్లో విచారణ నిర్వహించిన సిఐడి అధికారులు తమ విచారణ అంశాలను అత్యంత గోప్యంగా ఉం చినట్టు తెలుస్తోంది. సిఐడి అధికారులు విచారణ విషయం తెలుసుకున్న విలేఖరులు ఎఎస్పీ కార్యాలయానికి వెళ్లినప్పటికీ ఎవరినీ అనుమతించకపోవడమే కాకుండా విచారణ అంశాలను తెలియచేసేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా సిఐడి డిఎస్పీ నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ ఎఎస్పీ ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించడంతో తాము పూర్తి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే దర్యాప్తు అంశాలను మీడియాకు తెలియచేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు ఆయన తెలిపారు.ఇదిలాఉండగా ఎఎస్పీ శశికుమార్ ఆత్మహత్యపై క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి తమ పరిధిలో వారు విచారణ నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశాన్ని, ఎఎస్పీ సర్వీసు రివాల్వర్‌ను తదితర వాటిని క్లూస్ బృందం పరిశీలించినట్టు తెలిసింది.