విశాఖ

విద్యాభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం,జూలై 3: దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. పి.ఆర్.టి.యు. ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కృష్ణా ఫ్యాలెస్‌లో ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి అయ్యన్న ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి బడ్జెట్‌లో 1,800 కోట్లు కేటాయించారన్నారు. సింగపూర్ వంటి చిన్న దేశాలు సైతం విద్యకు ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిపోయిన తరుణంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలంటే విద్య అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న రోజుల్లో విద్య లేకపోతే బ్రతకడం కష్టంగా మారుతుందన్నారు. బదిలీలతో ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. పి. ఆర్.సి.,పదవీ విరమణ వయస్సు పెంపుదల వంటి మార్పులు తీసుకువచ్చారన్నారు. విద్యావిధానంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుమార్పులు తీసుకువస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధునిక టెక్నాలజీతో విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసారన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని మెరుగుపరిచారన్నారు. ఈ విధానం అవలంభించడం ద్వారా పౌర సరఫరాల శాఖలో ఏడాదికి 1,823 కోట్లు ఆదా అయిందన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో జియోట్యాగింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చామని, దీని ద్వారా నిర్మాణంలో ఉన్న భవనాలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలంటే ప్రతీ ఒక్కరికీ విద్య అవసరమన్నారు. గ్రామాల్లో నేటికీ ఉపాధ్యాయులను ప్రజలు ఎంతో గౌరవ భావంతో చూస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రంలో 62,568 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు వ్రాయగా కేవలం 535 మంది మాత్రమే 10/10 గ్రేడ్ సాధించడం విచారకరమన్నారు. ఈఫలితాలను గొప్పగా సాధించామని చెప్పుకోవడం సరైంది కాదన్నారు. వచ్చే ఏడాది సవాల్‌గా తీసుకుని మంచి ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జెడ్పి చైర్ పర్సన్ లాలం భవానీ మాట్లాడుతూ సమాజాభివృద్ధికి విద్య ఎంతో అవసరమన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా ఉపాధ్యాయులు విద్యను బోధించాలన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు సాధించాలన్నారు. విద్యా రంగంలో విశాఖ జిల్లా ముందంజలో ఉండేలా కృషి చేయాలని ఆమె కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌పై త్వరలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎల్.కె.జి. నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని సూచించారు. సి.పి. ఎస్.విధానం వలన ఉపాధ్యాయులకు తీరని నష్టం ఏర్పడుతుందన్నారు. గత నాలుగేళ్ళ కాలంలో 65 మంది ఉపాధ్యాయులు మృతి చెందగా వారి కుటుంబాలకు ఎటువంటి బెనిఫిట్స్ అందలేదన్నారు. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా సి.పి. ఎస్.విధానాన్ని సమీక్షించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. తమిళనాడు తరహాలో సి.పి. ఎస్.ను అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈసమావేశంలో డిప్యూటీ డి. ఇ. ఓ. సి.పి.రేణుక, మున్సిపల్ వైస్ చైర్మెన్ సన్యాసిపాత్రుడు, పి. ఆర్.టి.యు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. ఆదినారాయణ, డి.జి.నాధ్, అయ్యన్నయువసేన అధ్యక్షుడు సి.హెచ్.విజయ్ తదితరులు మాట్లాడారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమోంటోలను మంత్రి చేతుల మీదుగా బహుకరించారు.

ఫిరాయింపులపై స్పీకర్ తీరు సరికాదు
విశాఖపట్నం, జూలై 3: పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయం సరికాదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనర్హత పిటిషన్ల వాస్తవికతను పరిగణలోకి తీసుకోవాలని, అవి సరైన ఫార్మాట్‌లో లేవన్న కారణంగా తిరస్కరించినట్టు ప్రకటించడం సమర్ధనీయం కాదన్నారు. సభ్యుల అనర్హత విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమైనప్పటికీ కొన్ని అంశాల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. హైకోర్టు తరలింపు విషయంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారంపై రాఘవులు మండిపడ్డారు. కోట్లాది రూపాయలు వెచ్చించి సచివాలయం భవనాలు నిర్మిస్తున్న ప్రభుత్వం హైకోర్టు విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని, లేనిపక్షంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో ఏర్పాటు చేసే అత్యంత ప్రమాదకరమని అన్నారు. అణువిద్యుత్ ప్లాంట్ దేశ విద్యుత్ అవసరాలను గానీ, రక్షణ ప్రయోజనాలనకు కానీ తీర్చలేదన్నారు. అమెరికా సంస్థ పురాతన పరికరాలు, పాత సాంకేతికతనే వినియోగించే పరిస్థితి ఉందన్నారు. ఇక ఉత్పాదక వ్యయం కూడా అధికమేనని, తద్వారా వినియోగదారునిపై భారం తప్పదన్నారు. అణువిద్యుత్ ప్లాంట్ అంశంలో ఈ నెల 17న జాతీయ సెమినార్‌ను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సదస్సుకు సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కరత్, అటమిట్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎ గోపాలకృష్ణ, కేంద్ర ప్రభుత్వ ఇంథన శాఖ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి ఇఎఎస్ శర్మ, ఖైరతాబాద్ అణుప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు వివేక్ మోంటైరో, ప్రొఫెసర్ బాబూరావు తదితరులు పాల్గొంటారన్నారు.
అణు విద్యుత్‌ప్లాంట్‌పై ఉద్యమం : నర్శింగరావు
కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై సిపిఎం విశాల ఉద్యమం చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నర్శింగరావు అన్నారు. గుజరాత్‌లో పెట్టాల్సిన ప్లాంట్‌ను ఇక్కడకు తరలించారన్నారు. కెజి బేసిన్‌లో ఉన్న గ్యాస్ నిక్షేపాలను గుజరాత్ తరలించుకుపోయి, అణు కుంపటిని మన నత్తెన రుద్దుతున్నారన్నారు. ఇది ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ నీతిగా అభివర్ణించారు. రియాక్టర్లను పరీక్షించకుండా, పెట్టడం వల్ల ఎంతో ప్రమాదమన్నారు. దీనికి సుమారు 2.8 లక్షల కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తం భరించేందుకు బ్యాంకులు ముందుకు రావన్నారు. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అణు విద్యుత్ ప్లాంట్‌కు తాము వ్యతిరేకమని ప్రకటించారని, ఇప్పుడు దీనిపై పెదవి విప్పడం లేదన్నారు.

అమాత్యా... హామీలు నెరవేరునా?
జగదాంబ, జూలై 3 : విశాఖ జిల్లాకు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చెప్పిన అమాత్యుల మాటలు నేటికీ నెరవేరలేదు. ఆరేళ్లుగా ఉద్యమం సాగిస్తున్నా నేటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వర్ధంతి, జయంతి వేడుకలను గడచిన మూడు సంవత్సరాలుగా అధికారికంగా నిర్వహిస్తున్నారు తప్ప అల్లూరి వంశీకులు, బంధువులు తదితరుల గురించి పట్టించుక్నున దాఖలాలు లేవు. 2010లో అల్లూరి రాష్ట్ర యువజన సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కె.డి. పేట కేంద్రంగా విశాఖ జిల్లాకు అల్లూరి జిల్లాగా నామకరణం చేయాలని ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడంతో ఈ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తుతానని అప్పటి నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప ఇచ్చిన హామీ మేరకు అప్పట్లో ఇది సద్దుమణిగినప్పటికీ నామకరణంపై నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అల్లూరి పుట్టింది విశాఖ జిల్లా పాండ్రంగి కాగా, ఉద్యమం నడిపింది చింతపల్లి, కొయ్యూరు, కెడిపేట ప్రాంతాల్లో. అయితే నేటికీ ఆయా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోనేలేదు. పర్యాటకంగా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఎంతో మేలు జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. అల్లూరి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు దీక్షలు జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యేలు స్పందిస్తేనే అల్లూరి సీతారామరాజు జిల్లాగా విశాఖ పేరు మారగలదు.
మంత్రి అయ్యన్నపైనే ఆశలన్నీ
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడుపైనే అల్లూరి పేరు జిల్లాకు నామకరణం కాగలదు. అల్లూరి సంచరించిన కృష్ణదేవిపేట ప్రాంతాన్ని మంత్రి దత్తత తీసుకోవడంతో ఇప్పటికే రూ. 3 కోట్లతో అల్లూరి థీమ్‌పార్కును సుందరంగా, పర్యాటకుల మనసు దోచేలా అభివృద్ధి చేశారు. ఈ విషయమై సిఎం చంద్రబాబుతో చర్చించి, క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తేనే అనుకున్నది సాధించగలరు.

విదేశీ సంస్కరణలను
తిప్పికొడితేనే అల్లూరికి ఘన నివాళి
* డివైఎఫ్‌ఐ నిర్వహించిన అల్లూరి సదస్సులో వక్తలు
జగదాంబ, జూలై 3: భారతదేశంలో తెల్లదొరలను తరమికొట్టి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పెద్దఎత్తున పోరాటం నిర్వహించి చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి లో అల్లూరి సీతారామరాజు ఒకరు. నాడు తెల్లదొరలను బయటకు పంపితే నడే విదేశీ సంస్కరణలతో మళ్ళీ భారతదేశంలో అడుగుపెట్టండని దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబులు ఆహ్వానించడాన్ని ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ, డివైఎఫ్‌ఐ మాజీ కార్యదర్శి ఎంవిఎస్ శర్మ ఖండించారు. నేడు అల్లూరి సీతారామరాజు 119వ జయంతి సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి సెమినార్‌ను డాబాగార్డెన్స్‌లో హోటల్ చంద్రాస్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు దాటినా నేటికీ సామాన్య ప్రజల జీవితాలు ఆగమ్యగోచరంగానే ఉన్నాయన్నారు. గిరిజనుల పరిస్థితి మరింత దిగజారిపోతుందన్నారు. నేడు భారతదేశం అభివృదిధకి యువతను ఉపయోగించుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. నేడు విద్య, ఉపాధి అందించడం లేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఏ గిరిజన హక్కుల కోసమైతే అల్లూరి పోరాటం చేసి ప్రాణత్యాగం చేశాడో అదే గిరిజనులను అన్యాయం చేయడానికి ఈ రోజు టిడిపి ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. విదేశీ సంస్కృతిని మన దేశంలోకి తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను దేశంలోకి ఆహ్వానించడమంటే స్వాతంత్ర పోరాటయోధులకు తూట్లు పొడవటమేన్నారు. అల్లూరి స్ఫూర్తితో ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం నేటి యువతపై ఉందన్నారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు మాట్లాడుతూ మోదీ ఏడాదికి రెండు కోట్లు, చంద్రబాబు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ హామీలిచ్చారన్నారు. వీరిద్దరూ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళల్లో ఇచ్చిన ఉద్యోగాలు కంటే తొలగించినవే ఎక్కువుగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నా వాటి భర్తీలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ఉపాధి సమస్యపై పెద్దఎత్తున ఆందోళన చేయబోతున్నట్టు ప్రకటించారు. నగర కార్యదర్శి వి.కృష్ణారావు అధ్యక్షత వహించగా అల్లూరి చిత్రపటానికి ఎంవిఎస్ శర్మ, ఎం.సూర్యారావులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంత రాష్ట్ర అధ్యక్షులు డి.ప్రభాకర్, డివైఎఫ్‌ఐ మాజీ కార్యదర్శి, సిఐటియు నగర అధ్యక్షులు ఆర్‌కెఎస్‌వి కుమార్, సిపిఎం మాజీ జివిఎంసి ఫ్లోర్ లీడర్ బొట్టా ఈశ్వరమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షులు కె.్ఫృద్వీరాజ్, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు ఎ.పైడిరాజు, బొట్టా వరప్రసాద్, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేట్రేగిపోతున్న గంజాయి స్మగ్లర్లు
10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
* నిందితుల అరెస్ట్
నర్సీపట్నం,జూలై 3: విశాఖ మన్యం నుండి అక్రమంగా తరలిస్తున్న సుమా రు 10 లక్షల విలువ చేసే గంజాయిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న బోలోరో వాహ నం, ఆటో,బైక్‌ను స్వాధీనం చేసుకుని ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివా రం ఉదయం నర్సీపట్నం, చింతపల్లి మార్గంలో రూరల్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుండి వస్తున్న బోలోరో వ్యాన్, ఆటో, బైక్‌ను ఆపి తనిఖీ చేయగా ఆటో, బోలోరో వ్యాన్‌లో ఉన్న 214 కిలోల గంజాయిని గుర్తించారు. ఈ వాహనాల్లో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన చిన్నస్వామి, సుబ్రమణ్యం, రోలుగుంట మండలం బి.బి. పట్నంకు చెందిన తాడి సత్తిబాబు,జి.మాడుగుల మం డలానికి చెందిన కొండపల్లి మత్స్యరాజు, చింతపల్లి మండలం కొండ సంతకు చెందిన మాడెం రాజుబా బు, నర్సీపట్నం మండలం అమలాపురంనకు చెందిన గొర్లె అప్పలనాయుడు, గొలుగొండ మండ లం వడ్డిపకు చెందిన ముక్కాడాపల్లి రమణ, శరభవరంకు చెందిన అడగర్ల చినబాబు, వజ్రగడకు చెందిన ఇటంశెట్టి వరహాలబాబులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు. వీరి వద్ద నుండి ఎనిమిది సెల్‌పోన్లు, 19,250 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సిఐ. ఆర్.వి. ఆర్.కె. చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో ట్రైనీ ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.
అనకాపల్లిలో
అనకాపల్లి(నెహ్రూచౌక్): పాడేరులో కొనుగోలు చేసిన 44కిలోల గంజాయిని ఢిల్లీకి తరలించే ప్రయత్నంలో అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో పట్టణ పోలీసులకు అదివారం పట్టుబడ్డారు. ఎస్‌ఐ రామారావు అందించిన వివరాలు ప్రకారం ఢిల్లీకి చెందిన భాస్కర్ (23), మాకేష్ (25) అనే ఇద్దరు వ్యక్తులు పాడేరులో గంజాయిని కొనుగోలుచేసి ఢిల్లీ వెళ్ళేందుకు అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకొన్నారు. అయితే పట్టణ పోలీసులకు ముందస్తు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ రామారావుఅధ్వర్యంలో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్దఉన్న బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి ప్యాకేట్‌లు బైయట పడ్డాయన్నారు. దీంతోపాటు 10వేలు రూపాయలు నగదు, మూడు సెల్‌పోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు రామారావు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలిస్తామని ఆయన తెలిపారు.
సీలేరులో
సీలేరు: ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 14 కేజీల స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ మేరకు ట్రైనీ ఎస్సై డి.వెంకన్న తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం స్థానిక పోస్ట్ఫాసు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి రెండు స్టీల్ క్యారియర్లతో అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా క్యాన్లలో పైన కారం వేసి కింద భాగంలో గంజాయిని ఫ్యాకింగ్ చేసినట్లు గుర్తించారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లా పెదవీర్ల గిరి మండలానికి చెందిన కొండలరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.పట్టుబడిన గం జాయి విలువ 30వేలు ఉంటుందని ఆయన తెలిపారు.నిందితుడిని విచారించగా వ్యవసాయ పనులు లేక గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి ఆంధ్రా మీదుగా తమిళనాడుకు తరలిస్తున్నట్లు విచారణలో తెలిపినట్లు ట్రైనీ ఎస్సై తెలిపారు.

స్మార్ట్ నిధులు మాటేమిటీ?
* మంజూరైనా అందని రూ.375 కోట్లు
* అమృత్ నిధులతో సరి
విశాఖపట్నం, జూలై 3: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) స్మార్ట్ నిధుల విడుదలపై చోటుచేసుకుంటున్న జాప్యం యంత్రాంగాన్ని కలవర పరుస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.375 కోట్లమేర స్మార్ట్‌నిధులను మంజూరు చేసినప్పటికీ అవి జివిఎంసి ఖాతాకు చేరలేదు. ఇప్పటికే స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో తొమ్మిది అంశాలకు సంబంధించి జూన్ 25న సిఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభం కూడా చేశారు. అయితే స్మార్ట్ పనులు మొదలు పెట్టేందుకు ప్రస్తుతం జివిఎంసి అమృత్ నిధులపైనే ఆధారపడింది. ఇటీవల
రూ.12.5 కోట్లు అమృత్ నిధులు విడుదల కావడంతో తాత్కాలికంగా కార్యక్రమాలు నడిపించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ‘గడపగడపకు వైకాపా’
మునగపాక, జూలై 3: తెలుగుదేశం ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ నెల 8 నుండి గడగడపకు వైకాపా కార్యక్రమం నిర్వహిస్తున్నామని యలమంచిలి నియోజక వర్గం అదనపు కోఆర్డినేటర్ బొడ్డేడ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వైకాపా కార్యాలయం అవరణలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చినపప్పటిన నుండి కార్యకర్తలకు ప్రయోజనం కలిగే పధకాలను ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను తుంగలోకి తొక్కి ప్రజలను నయవంచనకు గురుచేసిందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీచేస్తానని ఇచ్చిన హమీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని అన్నా రు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. బాబువస్తే జాబు అంటు గ్లోబల్ ప్రచా రం చేసి, యవతకు నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువతను నిరాసకు గురిచేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైపల్యాలపై ఇంటిటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయవలసిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో వైకాపా అధికారం చేపడుతుందని ప్రసాద్ జోస్యం చెప్పా రు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి మళ్ల నాగసన్యాసిరావు, మండల ఉపాధ్యాక్షుడు దొడ్డి వరహసత్యనారాయణ, వైకాపా జిల్లా కార్యదర్శులు శరగడం జగన్నాథరావు, దాసరి అప్పారావు, మునగపాక తదితరులు పాల్గొన్నారు.