విశాఖ

పాలకవర్గానికి ఆ అధికారం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జూలై 4: మున్సిపాలిటీల్లో ఏకపక్షంగా ఆస్తి పన్నులు పెంచే అధికారం పాలక వర్గాలకు లేదని ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ అన్నారు. ఆస్తి పన్ను పెంపుదలశాస్ర్తియంగా ఉండాలన్నారు. సోమవారం పన్ను చెల్లింపుదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజా సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శర్మ మాట్లాడుతూ 1992లో వచ్చిన నిబంధనల ప్రకారం మున్సిపల్ కౌన్సిల్‌కు అధికారాలను పరిమితం చేశారన్నారు. అప్పటి నుండి పాలకవర్గాల కంటే మున్సిపాలిటీలో అధికారులకే పెత్తనం పెరిగిందన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు ఇష్టారాజ్యంగా ఆస్తి పన్ను పెంపుదల చేస్తున్నారన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యతలు తప్పించుకుని ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. మున్సిపాలిటీల్లో వేర్వేరు పద్ధతుల్లో పన్నులు వసూలు చేయడం సరైన విధానం కాదన్నారు. గంగవరం పోర్టు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు 60 కోట్లు పన్ను బకాయి చెల్లించలేదని, అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులను నిలదీసి ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు. ప్రజలు స్పందించక పోతే ఎన్నిరకాల ఛార్జీలైనా బనాయిస్తారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, అధికారులు కూడా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోలేరన్నారు. మున్సిపల్ అధికారులు పౌర సేవలను విస్మరిస్తున్నారన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకు నే అధికారం అధికారులకు లేదన్నారు. ఈసమావేశంలో పన్నుల చెల్లింపుదారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కె.త్రిమూర్తుల రెడ్డి, కన్నయ్యశెట్టి పాల్గొన్నారు.