విశాఖ

అల్లూరి పరాక్రమశాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.డి.పేట, జూలై 4: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సంచరించిన చారిత్రక ప్రదేశాలను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖా మంత్రి సి.హెచ్. అయ్యన్నపాత్రుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు 119వ జయంతి వేడుకలను విశాఖ జిల్లా కృష్ణాదేవిపేట అల్లూరి పార్కులో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వపరంగా జయంతి వేడుకలు నిర్వహించడంతో భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి మంత్రి అయ్యన్న, ఎం.పి. ఎం.శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, జాయింట్ కలెక్టర్ తదితరులు పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా సమాధుల ప్రాంతానికి తరలివెళ్ళారు. పార్కులో అల్లూరి, గంటం దొర సమాధులకు పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అల్లూరి వేషధారణలతో పలువురు చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ భావితరాలకు జ్ఞాపికగా ఈ ప్రాంత ప్రతిష్ఠ పెరిగేలా అల్లూరి చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారన్నారు. అల్లూరి మెమోరియల్ పార్కుగా తీర్చిదిద్దుతామని గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేయగా ఆయన అంగీకరించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. అల్లూరి అంటే చిన్న నాటి నుండి అభిమానం, గౌరవం ఉన్నాయన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఈ ప్రాంత ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న చంద్రబాబుకు అయ్యన్న కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి ఎం.పి. ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన్యం ప్రజల హక్కుల కోసం పిన్నవయస్సులోనే ప్రాణాలర్పించిన అల్లూరి ఆశయాల సాధనకు అందరి సహకారం అవసరమన్నారు. పార్కులో స్టేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు,అడిషనల్ ఎస్పీ కరణం సత్యనారాయణ, ఎ.యు. వైస్ ఛాన్సలర్ డి.వి. ఎన్.రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, జాయింట్ కలెక్టర్ నివాస్, డి.ఎఫ్.ఒ లక్ష్మణ్, ఆర్డీవో సూర్యారావు పాల్గొన్నారు.