విశాఖ

విశాఖ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగపాక, జూలై 4:విశాఖ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయవలసిన అవసరముందని యలమంచిలి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మండలంలో గల తిమ్మరాజుపేటలో స్థానిక ఎంపిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి 119 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సేవలు మరువరానివని అయన అన్నారు. వేలాది కిలో మీటర్లు పాదయాత్రలు చేసి గిరిజనుల్లో చైతన్యం రగిలించి తెల్లవారిని ఎదిరించి తన ప్రాణాలను పణంగా పెట్టి అశువులు బాసిన అల్లూరి దేశం కోసం చేసిన సేవలు నేడు యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఎంపిపి ఆడారి మంజు పేదలకోసం ఏర్పాటు చేసిన రెండు వందల దుప్పట్లు ఎమ్మెల్యే పంచకర్ల, ఆర్డీఓ పద్మావతి చేతులు మీదుగా వృద్ధులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సూరిశెట్టి రాజేశ్వరీరాము, మాజీ ఎంపిపి కొయిలాడ వెంకట్, మండల పార్టీ అధ్యక్షుడు దాడి ముసిలిఅప్పారావు, మద్దాల వీరునాయుడు, బివి రమణ, సర్పంచ్‌లు కర్రి భాస్కరావు, యల్లపు వెంకట బాస్కరరావు, సుందరపు వెంకటకనకఅప్పారావు, ఎంపిటిసిలు దాడి జమునా, ఉల్లింగల గోవింద, టిడిపి నేతలు ఆడారి జగన్నాధరావు, ఆడారి గోవింద్, శరగడం యోగినాగేశ్వరావు, ఆడారి నాగేశ్వరావు, కర్రి ఉస్తేల్ నాయుడు, మద్దాల నాగఅప్పారావు పాల్గొన్నారు.