విశాఖ

విఎండిఎపై స్పష్టత వచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) పరిధిని పెంచుతూ విశాఖ మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (విఎండిఆర్‌ఎ)గా చేసినప్పటికీ ఇందుకు సంబంధించిన వివిధ అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మంగళవారం జరుగనున్న బోర్డు సమావేశంలో ఇందుకు సంబంధించిన వివిధ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వుడా పరిధిని రాజాం నుంచి తుని వరకూ విస్తరించడం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకూ 1721 చదరపు కిలోమీటర్లు ఉన్న పరిధి దాదాపు 6700 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. విఎండిఆర్‌ఎను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వివిధ అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విశాఖ పరిసరాల స్థలాలకు ప్రాధాన్యత ఎక్కువ అవుతుండటంతో మాస్టర్ ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని సంస్థలను ఇందుకు వడపోత అనంతరం ప్రాథమికంగా గుర్తించినప్పటికీ ఇంకా ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కావాల్సి ఉంది. పరిధి గణనీయంగా పెరగడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరు. అదనంగా సిబ్బందిని నియమించాల్సి ఉంది. పరిధి పెరగడంతో కొన్ని పోస్టుల స్థాయి పెంచాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అవసరమైన వివిధ పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ బోర్డులో తీర్మానం చేయనున్నారు. ఇందుకు కావాల్సిన అదనపు నిధులు తదితర అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నారు. ఎన్‌ఎడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, గండిగుండం వద్ద సమీకృత క్రీడా గ్రామం తదితర అంశాలు చర్చకురానున్నాయి.