విశాఖ

ఆ స్ఫూర్తి గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మనాభం,జూలై 4 : ఎందరో మహానుబావులు ప్రాణత్యాగం చేసి సంపాదించిన స్వాతంత్య్ర స్ఫూర్తి గొప్పదని, దానిని నేటి బాలల్లో నింపాలని కేంద్ర విమాన యానశాఖ మంత్రి పి.అశోకగజపతిరాజు అధికారులు, పెద్దలను కోరారు. సోమవారం పాండ్రంగి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే అప్పలనర్శింహరాజు, సర్పంచ్ వజ్రకుమార్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి 119వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పి. రఘునాథరెడ్డి, విశాఖ ఎం.పి. కె. హరిబాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్శన్ లాలం భవానీ, ఎంపిపి పద్మ, జెడ్‌పిటిసి దామోదరరావు, ఎజెసి వెంకటరెడ్డి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన పెద్దలను మనం గౌరవించాలని ఆయన అన్నారు. అల్లూరి పుట్టిన పాండ్రంగి పుణ్యభూమి అన్నారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పి.రఘునాథరెడ్డి మాట్లాడుతూ పాండ్రంగిలో అల్లూరి పేరుమీద అద్భుతమైన ఆడిటోరియంను నిర్మించడానికి ఎంతైనా ఖర్చు పెడతామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగు జాతికి వనె్న తెచ్చిన నాయకుల జయింతులను రాష్ట్ర లాంఛనాలతో పండగలా నిర్వహించుకుంటున్నామన్నారు. అద్భుతంగా నాట్యం చేసిన ప్రణతికి కృష్ణా ఉత్సవాలకు అవకాశం కల్పిస్తామని అన్నారు. ఎం.పి. హరిబాబు మాట్లాడుతూ నిరక్ష్యరాస్యులు, పేదలు, గిరిజనులను అభివృద్ధి చేసినపుడే అల్లూరికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అన్నారు. ముందుగా అల్లూరి పార్కును ప్రారంభించారు. ఆనందపురానికి చెందిన బమ్మిడ తారక్ అల్లూరిపై రచించి గానం చేసిన సిడిని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైనిక్ స్కూలు రిజిస్ట్రార్ ఎం. సుబ్బారావు, 5వ బెటాలియన్ కమాండెంట్ విద్యాధరరావు, ఎంపిపిలు వెంకటప్పడు, టిడిపి అద్యక్షుడు నగేష్‌కుమార్, నూకరాజు, నాయకులు రాజబాబు, ఉమ, మణిశంకరనాయుడు పాల్గొన్నారు.