విశాఖ

బాక్సైట్ తవ్వే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 17:విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర శాసనసభ ఎస్.టి. కమిటీ చైర్మన్ ఎం.శ్రీనివాస్ స్పష్టం చేశారు. పాడేరులోని శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని ఆదివారం ఆయన దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యురాలు, ఎస్.టి.కమిటీ సభ్యురాలు గిడ్డి ఈశ్వరి నివాసంలో కొద్ది సేపు విలేఖరులతో మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలు జరిపేది లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పారు. అయితే బాక్సైట్ తవ్వకాలు జరపబోమని చెబుతున్న ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జి.ఒ.నెం.97ను రద్దు చేయకపోవడానికి గల ఆంతర్యమేమిటనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. బాక్సై ట్ తవ్వకాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ప్రజలకు ఆమోదయోగ్యం కాని పనిని తమ ప్రభుత్వం చేయబోదని ఆయన పేర్కొన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించాలని కోరుతూ తమ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. విశాఖ ఏజెన్సీలో నవంబర్ నెలలో తమ కమిటీ పర్యటించనున్నట్టు ఆయన తెలిపారు. పాడేరు, రంపచోడవరం ఐ.టి.డి.ఎ.లను ఎస్.టి. కమిటి సందర్శించి ఈ ప్రాంతంలో అమలు చేస్తున్న పథకాలు, గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయనున్నట్టు ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ఇటీవల తమ కమిటీ సమావేశమై ఏజెన్సీ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలపై చర్చించినట్టు ఆయన తెలిపారు. విశాఖ ఏజెన్సీలో వ్యాధులు ప్రబలి గిరిజనులు మృతి చెందుతున్నారని, ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీని విధించాలని తమ కమిటీ సభ్యురాలు ఈశ్వరి కోరారని ఆయన చెప్పారు. ఈ విషయమై తమ కమిటి ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఆయన తెలిపారు. గిరిజన ప్రాంత ఆరో గ్య కేంద్రాలలో సిబ్బంది కొరత అధికం గా ఉందని, ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఏరియా ఆసుపత్రులలో గైనకాలజిస్ట్, పిడియాట్రిస్ట్, వంటి ముఖ్యమైన విభాగాలకు వైద్యులను నియమించాల్సి ఉందని ఆయన అన్నారు. గిరిజన ఉప ప్రణాళిక కింద విడుదలవుతు న్న నిధులు దారి మళ్లుతున్నట్టు వస్తున్న ఆరోపణలు ఆయన దృష్టికి తీసుకురాగా ఉప ప్రణాళిక నిధులు కేవలం గిరిజనుల అభివృద్ధికే వెచ్చిస్తున్నారని చెప్పారు. గతంలో కంటే ఈ సారి గిరిజ న ఉప ప్రణాళికను పకడ్భందీగా అమ లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉప ప్రణాళిక కింద విడుదలవుతున్న నిధు లు దుర్వినియోగం అవుతున్న విషయా న్ని ఆయన దృష్టికి తీసుకురాగా ఈ విషయమై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ చెప్పారు.

*