విశాఖ

రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం,జూలై 17: బాక్సైట్ తవ్వకాలపై పి.సి.సి. అధ్యక్షుడు రఘువీరారెడ్డికి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం నర్సీపట్నంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి హాజరైన పి.సి.సి. అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పిల్లి కృపారాణి, మాజీ మంత్రి,డి.సి.సి. అధ్యక్షుడు పసుపులేటి బాలరాజులు మంత్రి అయ్యన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తనకు మంచి మిత్రుడు అని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అయితే బాధ్యత కలిగిన మంత్రి హోదాలో ఉంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. వాస్తవాలను మరుగున పెట్టడం తగదన్నారు. మంత్రి అయ్యన్న ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదని, అతిగా పోవద్దని హితవుపలికారు. చంద్రబాబు మిమ్మల్ని బలిపశువును చేయాలని చూస్తున్నారని, దయ చేసి బలి పశువు కావద్దని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ బాక్సైట్‌పై మాట్లాడటానికి రఘువీరారెడ్డికి సిగ్గుండాలని మంత్రి అయ్యన్న వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయడంలో మీ ప్రభుత్వం వైపల్యం చెందినందుకు సిగ్గుపడాలా అని ప్రశ్నించారు. ఆరుశాతంగా ఉన్న గిరిజనులకు మంత్రి వర్గంలో స్ధానం కల్పించకపోవడం, రెండేళ్ళకాలంలో సంక్షేమ పథకాలు అమలుచేయనందుకు , 12 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధులు మింగేసినందుకు సిగ్గుపడాలా అని నిలదీశారు. గిరిజనుల హక్కు చట్టం ద్వారా 6.35 లక్షల ఎకరాల అటవీ భూములపై గిరిజనులకు హక్కు కల్పించిన ఘనత యు.పి.ఎ. ప్రభుత్వానిదేనన్నారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉద్యమం చేపడుతున్నారన్నారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు కాంగ్రెస్ పార్టీ ఆదినుండి వ్యతిరేకం గానే ఉందన్నారు. గిరిజన సలహా మండలి చైర్మెన్‌గా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు జైరామ్ రమేష్, కిశోర్ చంద్రదేవ్‌లు బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. భవిష్యత్‌లో కూడా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడు కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు చెప్పినన్ని అబద్దాలు దేశంలో మరెవ్వరూ చెప్పరన్నారు. 2003లో చంద్రబాబు హయాంలోనే బాక్సైట్ ఖనిజాన్ని దుబాయ్ కంపెనీకి కేటాయించారన్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదనేది ఎ.ఐ.సి.సి. విధానం అన్నారు. దీనిలో భాగంగానే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఎ.ఐ.సి.సి. ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటించి పాదయాత్రలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారాలను మానుకుని గిరిజనుల హక్కులకు, వారి రక్షణకు హాని కలిగించే బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో కలిసి రావాలని మనోహర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మాజీ మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడారు.