విశాఖ

రూ.ఆరు వేల కోట్లతో చేనేత, జౌళి శాఖ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, ఆగస్టు 4: ఆరువేల కోట్లతో చేనేత, జౌళి శాఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చేనేత, జౌళి శాఖ బోర్డు సభ్యులు పొన్నగంటి అప్పారావు అన్నారు. గురువారం మం డలంలో తాళ్లపాలెం గ్రామంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం తరువాత అత్యధిక ప్రాధాన్యత చేనేతకే ఉందని, ఈ రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. గతంలో రెండువేల కోట్లు మాత్రమే ఖర్చుచేసేవారని, ఇప్పుడు ఆ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆరువేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు.కార్మికుల వలసలను నివారించేందుకు దేశవ్యాప్తంగా పదివేల క్లస్టర్‌ల ద్వారా కార్మికులకు శిక్షణనిస్తున్నామని, ఒక్కో క్లస్టర్‌కు రెండుకోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. శిక్షణా సమయంలో రూ.3600 విలువ చేసే నూలు, ప్రతీరోజు స్ట్ఫైండ్ కార్మికునికి నెలరోజులపాటు రోజుకు రూ.210 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 7న చేనేత, జౌళి దినోత్సవం సందర్భంగా 6న అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చేనేత కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనే త కార్మికులు తయారుచేసిన వస్త్రాలు దేశవిదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉందన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి 13శాతం ఆదాయం లభిస్తుందన్నారు. ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వం ద్వారా పేదలకు చేనేత వస్త్రాలు పంపిణీ చేసి సంబంధిత పరిశ్రమను ఎంతగానో ఆదుకున్నారని కొనియాడారు. అదే విధానాన్ని ప్రస్తుతం కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రం సేలంలో చేనేత, జౌళి శాఖకు సంబంధించిన కళాశాల ఉండేదని, అయితే అది ఇప్పుడు నిరుపయోగంగా మారిందని, దీనిని ఇప్పుడు తెరిపించి యువతకు ఆధునిక పద్ధతులతో శిక్షణనిచ్చేందుకు బిజెపి ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు.