విశాఖ

ఎఎల్ పురంలో అతిసార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.డి.పేట, ఆగస్టు 4: ఎ.ఎల్.పురంలో అతిసార వ్యాధి సోకి 20 మందికి పైగా వాంతులు, విరోచనాలతో మంచాన పడ్డారు. వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి విశాఖ కె.జి.హెచ్.కు తరలించించారు. స్థానిక బి.సి. కాలనీలో రెండు రోజులు గా అతిసార వ్యాధి ప్రబలింది. బుధవా రం రాత్రి ఉడపర్తి బెన్నాస్వామికి తీవ్ర అస్వస్థత గురి కావడంతో కె.జి.హెచ్.కు తరలించినట్లు వైద్యాధికారిణి పద్మప్రియ తెలిపారు. గురువారం బి.సి. కాలనీలో ఈ వ్యాధి మరింత తీవ్రం కావడంతో చందక రామయ్యమ్మ,కక్కిరాల శివ, మామిడి వరహాలమ్మ, గాడి వరహాలబాబు, తానారి రాజు, తానారి దుర్గ, చందక వెంకట, నారికళ్ళ నర్సింగహులు, చింతల అప్పలనాయుడు, ఏకా సత్యవతి, నాతిరెడ్డి రాజు, వామనమూర్తి, కె.రామలక్ష్మి,రాములు, చిన్నోడు, చింతల్లి మరో ఐదుగురు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. వీరందరికీ వైద్యసేవలు అందిస్తున్నారు. అతిసార రోగులను జెడ్పిటిసి చిటిల వేణుగోపాల్, డి. ఎల్.పి. ఓ. శిరీషారాణి, ఎడీవోబలరాముడు, వైకాపా నాయకులు లగుడు మురళీకృష్ణ పరామర్శించారు.తక్షణమే వైద్య సేవలు ఏర్పాటు చేసి బాధితులకు వైద్య సేవలందించాలని వైద్యాధికారిణి కోరారు. పారిశుధ్యం లోపంతోనే అతిసారం ప్రబలినట్లు కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేసారు. పంచాయతీ సిబ్బంది పారిశుధ్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.