విశాఖ

‘ ఉపాధి’లో మర్రివలస భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.కోటపాడు, ఆగస్టు 4: ఉపాధి హామీ పనుల అమలులో మర్రివలస గ్రామం ఎంతో ముందుందని జాతీయ గ్రామీణాభివృద్ధి జాయింట్ సెక్రటరీ అపరాజిత సారంగి కొనియాడారు. గురువారం ఆమె 11 రాష్ట్రాలకు చెందిన 18 మంది ఐ.ఎ.ఎస్. అధికారులతో కలసి ఆ గ్రామం లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల తీరుతెన్నులను పరిశీలించారు. 3వ విడత అంతర రాష్ట్ర పరస్పర అవగాహన కార్యక్రమం సందర్భంగా ఆమె విశాఖపట్నం జిల్లా, కె.కోటపాడు మండలంలో మారుమూలన వున్న మర్రివలస గ్రామాన్ని ఆమె తన బృందంతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో నమ్మి నూకాలు గరువులో నీటి గుం తలు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. జరుగుతున్న పనుల వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. వేతనాల చెల్లింపు, పనుల వివరాలు నీటి కందకాలను క్షేత్రస్థాయిలో స్థానిక ఉపాధిపథకం అధికారులను, ఉపాధి కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు తమ ఉపాధి దినాలను మరో 50 రోజులకు పెంచాలని కోరారు. మరికొందరు ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయమని కోరగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుసంధానం చేయడం కుదరంటూ చెప్పడంతో పలువురు రైతులు నిరాశకు గురయ్యారు. అనంతరం కె.కోటపాడు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆద్యంతం కొద్దిపాటి చిత్తడి చినుకులు కురుస్తుండడంతో కార్యక్రమంలో కొద్దిపాటి అసౌకర్యం కలిగింది. అనంతరం చౌడువాడ గ్రామాన్ని సందర్శించాల్సి వున్నప్పటికీ అప్పటికే కాలాతీతం కావడంతో వారు పరిశీలన బృందం అధికారులు వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాటకకు చెందిన ప్రభాష్ చంద్రరే, గుజరాత్‌కు చెందిన సునీల్ పాటిల్, మధ్యప్రదేశ్‌కు చెందిన రఘురాజ్ రాజేంద్రన్, మహారాష్టక్రు చెందిన అభయ్ మహాజన్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆర్.కె. కుట్టి, బీహార్‌కు చెందిన సి.పి. కండూజా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పింకీజౌల్, ఝార్ఖండ్‌కు చెందిన సిద్ధార్థ్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ రామాంజనేయులు, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. ప్రోజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఎ.పి.డి. మల్లిఖార్జునరావు, శ్రీనివాసరావు, జిల్లా అడిషినల్ పి.డి. ఆనందరావు, ఎం.పి.డి.ఒ., ఆర్. పూర్ణిమాదేవి, ఎ.పి.ఒ. భాగ్యలతశ్రీ, డుమా పి.డి. డొక్కా గౌతమ్, స్థానిక సర్పంచ్ సీముసురి రమణ, పంచాయతీ కార్యదర్శి సరోజిని, మరో ఎం.పి.డి.ఒ. కె. శచీదేవి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్వర్ణలత పాల్గొన్నారు.