విశాఖ

కలసి రాని కృష్ణా పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 28: కృష్ణా పుష్కరాలు ఇటు రైల్వేకు, మరోపక్క ఆర్టీసీకి ఏమాత్రం కలసి రాలేదు. సాధారణ రద్దీతోనే ప్రత్యేక రైళ్ళు నడిచాయి. ఈ నెల 12వ తేదీ నుంచి 23 వరకు జరిగిన కృష్ణా పుష్కరాల కోసం దక్షిణమధ్య రైల్వే పలు ప్రాంతాల నుంచి విశాఖకు, ఇక్కడి నుంచి మరికొన్ని సుదూర ప్రాంతాలకు 56 ప్రత్యేక రైళ్ళను నిర్వహించగలిగింది. అయితే ఇవి తొలి మూడు రోజులు పెద్దగా ఆదరణ పొందలేకపోయాయి. చివరి మూడు రోజుల్లోనే రద్దీ పెరిగింది. ఈ విధంగా రోజుకి మూడు నుంచి నాలుగు లక్షలు మాత్రమే అదనంగా వాల్తేరు డివిజన్ పుష్కర ఆదాయాన్ని రాబట్టగలిగింది. రోజుకి సాధారణ రోజుల్లో 30 నుంచి 35 లక్షల మేర ఆదాయం ఉండగా, దీనికి మరో నాలుగు లక్షలు తోడైంది. తప్పితే భారీ మొత్తంలో సంపాదించిందంటూ లేకపోవడంతో వాల్తేరు డివిజన్ కమర్షియల్ విభాగం అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. వాల్తేరు డివిజన్ మొత్తం మీద ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా వార్షిక ఆదాయం రూ. 450 కోట్ల మేర వస్తుంది. అదే వారానికి లెక్కచూస్తే 2.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా వంద కోట్లకు పైగా ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటుంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ రైళ్ళ ద్వారా తప్పితే స్వల్ప ఛార్జీలతో నిర్వహించే పాసింజర్ రైళ్ళ ద్వారా నష్టాలే వస్తున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఆర్టీసీ అంతే...
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు కృష్ణా పుష్కరాల వలన ఒరిగిందేమీ లేదు. ముందస్తుగానే మూడు మాసాలపాటు కసరత్తు నిర్వహించి మరీ 12 రోజుల్లో 800 ప్రత్యేక బస్సులు నిర్వహించగలిగింది. అయినా ఫలితం లేకపోయింది. 60 వేల మంది పుష్కర భక్తులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా కేవలం రెండు కోట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతిరోజు 80 నుంచి 100 ప్రత్యేక బస్సులు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ విశాఖ రీజియన్ 12 రోజుల వ్యవధిలో మొత్తంమీద 800 బస్సులు మాత్రమే నడపగలిగింది. విజయవాడ పరిసరాల భక్తుల కోసం మరో 200 బస్సులు ఇక్కడి నుంచి వెళ్ళాయి. వీటన్నింటి ద్వారా వచ్చిదంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. పుష్కర భక్తులకు అందుబాటులోకి తీసుకురాగలిగామనే సంతృప్తి మాత్రం మిగిలినందని, లక్ష్యాలు చేరుకోలేకపోయామని సంబంధితాధికారి ఒకరు తెలిపారు.