విశాఖ

నేటి నుంచి ‘ప్రకంపన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 29 : విపత్తుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తూర్పు నౌకాదళాధికారి నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రకంపన సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే నౌకాదళం పూర్తి చేసింది. ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఠక్కర్ హాజరుకానున్నారు. దీనికి తోడు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల కూడా హాజరు కానున్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమీక్షించారు. విపత్తులు సంభవించినప్పడు వీలైనంత తక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు సమన్వయంతో పనిచేసేందుకు వీలుగా ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు వీలుగా ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. విపత్తు నివారణకు వివిధ సంస్థలు, ప్రభుత్వ శాఖ లు తీసుకున్న చర్యలు, చేసిన కృషిని సమ్మిళతం చేస్తూ ప్రకంపన పేరిట సంయుక్త విపత్తు నిర్వహణ విన్యాసాలను చేపట్టనున్నారు. ఆగస్టు 30 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో జరిగే ఈ సమావేశాలను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ లాంఛనంగా ప్రారంభిస్తారు. సమావేశం ప్రారంభోత్సవం ముగిసిన తరువాత విన్యాసాలను ఏర్పాటు చేశారు.