విశాఖ

ఆదాయం ఉంటేనే సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 29: పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరితేనే సంక్షేమ, అభివృద్ధి పథకాలు సవ్యంగా కొనసాగుతాయని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ విశాఖ డివిజన్ కార్యాలయం భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఒడిడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. విభజన అనంతరం రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా రాని పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఈ తరుణంలో పన్ను వసూళ్లు సక్రమంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం వచ్చే ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకురానున్న జిఎస్‌టి విధానం వల్ల పన్ను వసూళ్లలో పారదర్శకత పెరుగుతుందన్నారు. సింగిల్ పాయింట్ టాక్స్ వల్ల రాష్ట్రాలకు నష్టం వాటిల్లినప్పటికీ అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. వ్యాపారులకు నిజాయితీతో కూడిన సేవలందించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీనితో పాటు శాఖా పరంగా ఉద్యోగులు, అధికారుల్లో నిపుణత, నిజాయితీ పెరగాలన్నారు. పన్నులు పెంచడం ద్వారా ప్రజలు, వ్యాపారులపై భారం మోపే విధానం తమది కాదన్నారు. సంస్థాగతంగా పనితీరును మెరుగుపరచుకుంటూ అధిక ఆదాయాన్ని పొందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనికోసం మంచి వాతావరణాన్ని సృష్టించేందుకుగాను ప్రభుత్వ శాఖలకు సొంత కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతి నగరంలో కూడా తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ సొంత భవనాల నిర్మాణం కొనసాగుతుందన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖలకు సొంత భవనాలు నిర్మించే విషయంలో ముందుకు సాగుతున్నామన్నారు. దీనికోసం జిల్లాల్లో ప్రభుత్వ స్థలాను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రం ప్రగతి పథంలో నడిపేందుకు నిధులు అవసరమని, సక్రమంగా పన్నులు వసూలు జరగాలని సూచించారు. ఇదే సందర్భంలో ప్రజలు కూడా తమ బాధ్యతగా పన్నులు చెల్లించాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని, అందుకు ఆర్థిక మంత్రి యనమల వ్యూహం ఎంతో ఉందన్నారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ జె శ్యామలరావు మాట్లాడుతూ ఆర్థికంగా విశాఖ వాణిజ్య పన్నుల డివిజన్ ఎంతో కీలకమైందన్నారు. ప్రస్తుతం సొంత భవనం నిర్మించుకోగా, ఫర్నిచర్ ఇతర సదుపాయాల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెండో దశ నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎపిఎంఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ తొలి దశలో 20,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ భవనాన్ని రూ.4.5 కోట్లతో నిర్మించామని, రెండో దశలో మరో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సముదాయాలు నిర్మించాల్సి ఉందన్నారు. సమావేశంలో విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పిజివిఆర్ నాయుడు, వాసుపల్లి గణేష్‌కుమార్, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ నాగేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.