జాతీయ వార్తలు

వ్యవధి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జలాల వివాదంపై టి సర్కార్ విన్నపం * సరేనన్న సుప్రీం..కేసు జనవరి 13కి వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కృష్ణా జలాల పంపిణీని ఖరారు చేస్తూ జస్టిస్ బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయం మేరకే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు తమకు లభించిన కేటాయింపులను పంచుకోవలసి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమలు చేయటానికి తీసుకోవలసిన చర్యలపై వివిధ కోణాల నుంచి ఆలోచించవలసి ఉన్నందున కొంత వ్యవధిని ఇవ్వవలసిందిగా తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు ఆమోదం తెలియచేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను జనవరి 13కు వాయిదా వేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ సి పంత్‌తో కూడిన బెంచ్ గురువారం ఈ కేసును విచారించింది. గత వారం జరిగిన వాదోపవాదాలలో కేంద్ర ప్రభుత్వం నీటి పంపిణీ వివాదంతో తెలంగాణ, ఆంధ్రాకే తప్ప మిగిలిన రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానానికి నివేదించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయవలసిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. గురువారం కేసు విచారణకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడి రెండు రోజులు మాత్రమే అయినందున తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం అమలుపై దృష్టి పెట్టలేకపోయిందని ఆ రాష్ట్రం తరుపున వాదించిన న్యాయమూర్తి వైద్యనాథన్ బెంచికి తెలియచేశారు. తమ ప్రభుత్వం ఈ నిర్ణయం అమలుకు సంబంధించి అన్ని ఆంశాలను పరిశీలించవలసి ఉన్నందున విచారణను వాయిదా వేయవలసిందిగా ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటం తప్పించి ప్రత్యామ్నాయాలు లేవని కర్నాటక తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది నారిమన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయింపులకు ఆమోద ముద్ర వేస్తూ రాజపపత్రంలో ప్రకటించాలని ఆయన కోరారు. రాజపత్రంలో ప్రకటిస్తే తప్ప నీటి వాడకం సాధ్యపడదని ఆయన వాదించారు.